Let's talk: editor@tmv.in
ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు.. జ్ఞానభూమిలో ఘన నివాళులు

ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు.. జ్ఞానభూమిలో ఘన నివాళులు

Gaddamidi Naveen
29 జూన్, 2026

మాజీ ప్రధానమంత్రి, ‘భారత రత్న’ పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఆయనకు ఆదివారం ఘనంగా నివాళులర్పించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 'ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. పీవీ నరసింహారావు ఆధునిక భారతదేశాన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి అభివృద్ధి దిశగా నడిపించిన మహానేత పి.వి. నరసింహారావు అని కొనియాడారు. తెలంగాణ గడ్డపై జన్మించిన ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఈ గడ్డపై జన్మించిన పీవీని చూసి తెలంగాణ సమాజం ఎల్లప్పుడూ గర్విస్తుందని సీఎం పేర్కొన్నారు. ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రితో పాటు పీవీకి నివాళులర్పించిన వారిలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు.

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న (పీవీ ఘాట్) ‘పీవీ జ్ఞానభూమి’ వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, పలువురు నేతలు పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో విలువలు పడిపోతున్న ప్రస్తుత కాలంలో పీవీ నరసింహారావు రాజకీయ నాయకులకు ఒక గొప్ప రోల్ మోడల్ అని కొనియాడారు. టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పీవీ ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిగా, అద్భుతమైన ప్రధానిగా ఎప్పటికీ గుర్తుండిపోతారన్నారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పీవీ తనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చారని, ఈరోజు తాను రాజకీయాల్లో ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణమని కృతజ్ఞతగా గుర్తుచేసుకున్నారు. ప్రధానిగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా పీవీ చూపిన మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అనుసరిస్తుందన్నారు.

ట్యాగ్‌లు
PVNarasimhaRaoPVNRNarasimhaRaoPVJayantiTelanganaHyderabadRevanthReddyKishanReddy
ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు.. జ్ఞానభూమిలో ఘన నివాళులు - Tholi Paluku