
ఎండల నుంచి ప్రజలు జాగ్రత్త: ఐఎండీ
దేశంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) సమగ్ర హీట్‌వేవ్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉత్తర, మధ్య, ద్వీపకల్ప భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 40°సీ నుంచి 44°సీ వరకు నమోదవుతున్నాయి. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో అత్యధికంగా 44.5°సీ నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణ కంటే 5°సీ పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు ఐఎండీ తెలిపింది.
హీట్‌వేవ్ పరిస్థితులు ఎక్కడెక్కడ ?
ఐఎండీ అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో హీట్‌వేవ్ పరిస్థితులు ఈ ప్రాంతాల్లో కనిపించే అవకాశం ఉందని పేర్కోంది. జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్య భారత ప్రాంతాలు. అయితే తీరప్రాంతాలు, తూర్పు ప్రాంతాల్లో వేడి–తేమ (హాట్ & హ్యూమిడ్) పరిస్థితులు కొనసాగనున్నాయి. ఉత్తర భారతంలో రాత్రిపూట కూడా వేడి అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఉష్ణోగ్రతల మార్పులు
ఉత్తర–పశ్చిమ భారతదేశంలో ఏప్రిల్ 27 వరకు పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. అనంతరం కొంత తగ్గుదల ఉండవచ్చు. అయితే మధ్య భారతం, ఇతర ప్రాంతాల్లో ముందుగా పెరిగి, తర్వాత తగ్గే అవకాశం ఉంది.
ప్రజలకు ఐఎండీ* *సూచనలు
• మధ్యాహ్నం వేళల్లో నేరుగా ఎండలో ఎక్కువసేపు ఉండకండి
• తగినంత నీరు తాగండి
• లైట్, గాలి చొరబడే దుస్తులు ధరించండి
• తీవ్ర ఉష్ణోగ్రతల సమయంలో కఠినమైన శారీరక శ్రమ నివారించండి
• ప్రత్యేకంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
వచ్చే 7 రోజుల అంచనా
తదుపరి వారం రోజుల పాటు హీట్‌వేవ్ ప్రభావం ఈ ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంది:
• ఉత్తర–పశ్చిమ భారతం (పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, యూపీ)
• మధ్య భారతం (మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ)
• దక్షిణ ప్రాంతాల్లో కొన్ని భాగాలు (కేరళ, మాహే). ఇక ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి తీర రాష్ట్రాల్లో వేడి–తేమ పరిస్థితులు కొనసాగుతాయని తెలిపింది.
ముందస్తు జాగ్రత్తలు అవసరం
ఏప్రిల్–జూన్ మధ్యకాలానికి సంబంధించిన సీజనల్ అంచనాల ప్రకారం, సాధారణ కంటే ఎక్కువ హీట్‌వేవ్ రోజులు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సమాచారం ఆధారంగా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. హీట్‌వేవ్‌కు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు ఐఎండీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
