Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో మే 28న పాస్‌పోర్ట్ సేవలు బంద్

హైదరాబాద్‌లో మే 28న పాస్‌పోర్ట్ సేవలు బంద్

Gaddamidi Naveen
27 మే, 2026

బక్రీద్ సెలవు తేదీ మార్పు కారణంగా మే 28న పాస్‌పోర్ట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడనున్నాయని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం వెల్లడించింది. ఆ రోజు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (పీఎస్‌‌కేలు), పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (పీఓపీఎస్‌‌కేలు) అన్నీ మూసివేయబడతాయని అధికారులు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో మే 28 తేదీకి కేటాయించిన అన్ని అపాయింట్‌మెంట్‌లను మే 27వ తేదీకి రీషెడ్యూల్ చేసినట్లు ప్రకటించారు. సంబంధిత దరఖాస్తుదారులు కొత్త తేదీకి అనుగుణంగా కేంద్రాలకు హాజరై సేవలు పొందాలని సూచించారు.

అయితే మే 27న పాస్‌పోర్ట్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని, ఎలాంటి అంతరాయం ఉండదని డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు తమ అపాయింట్‌మెంట్ వివరాలను పరిశీలించి రీషెడ్యూల్ చేసిన తేదీకి మాత్రమే రావాలని అధికారులు సూచించారు. సెలవు మార్పు కారణంగా ఈ తాత్కాలిక సర్దుబాటు చేసినట్లు కార్యాలయం స్పష్టం చేసింది. పౌరులకు అసౌకర్యం కలగకుండా ముందస్తుగా సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.