
ఒరిజినల్ ఎప్పుడూ ఒరిజినలే: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ వ్యంగ్యాస్త్రాలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీకి 'తెలంగాణ రాష్ట్ర సేనస (టీఆర్ఎస్) అని పేరు పెట్టడంపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. సోషల్ మీడియా వేదికగా స్పందించిన బీఆర్ఎస్, కవిత పేరును నేరుగా ప్రస్తావించకుండానే ఒరిజినల్ ఎప్పుడూ ఒరిజినలే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ మేరకు అసలైన టూత్‌పేస్ట్, వాటర్ బాటిల్ బ్రాండ్‌లకు, వాటి నకిలీలకు మధ్య ఉన్న తేడాను చూపే ఫోటోలను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేసింది.
కవిత శనివారం తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తన ప్రసంగంలో కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఆర్ఎస్‌పై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. తన తండ్రి కేసీఆర్ మారిపోయిన వ్యక్తి, భావోద్వేగాలు లేని నాయకుడుగా మారారని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కేసీఆర్ 2022లో తన ప్రాంతీయ పార్టీ 'తెలంగాణ రాష్ట్ర సమితిస (టీఆర్ఎస్)ని జాతీయ పార్టీగా మారుస్తూ 'భారత్ రాష్ట్ర సమితిస (బీఆర్ఎస్)గా పేరు మార్చారు. ఇప్పుడు కవిత మళ్లీ అదే సంక్షిప్త పేరును (టీఆర్ఎస్) వచ్చేలా తన కొత్త పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.
