
ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లు పేదలకు అండగా నిలుస్తున్నాయి :ఎమ్మెల్యే గల్లా మాధవి
ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ పథకం పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసాగా నిలుస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు.
శుక్రవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 22వ డివిజన్ శ్రీనివాసరావుపేటలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతి రావు, ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వ ఆధ్వర్యంలో సామాజిక భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. గతంలో పెన్షన్ల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ప్రస్తుతం ప్రభుత్వం గడపగడపకు సేవలు అందిస్తూ పారదర్శకంగా పంపిణీ నిర్వహిస్తోందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోందని ప్రతి అర్హుడికి పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెన్షన్ అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా కుటుంబాలకు భరోసా, ఆత్మవిశ్వాసాన్ని అందించే ముఖ్యమైన పథకమని ఆమె పేర్కొన్నారు.
ఈ నెల నుండి కొత్తగా మంజూరైన పెన్షన్లను కూడా లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా లక్షలాది మందికి సమయానికి పెన్షన్లు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
