Let's talk: editor@tmv.in
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నార్వే రాయబారి భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నార్వే రాయబారి భేటీ

Gaddamidi Naveen
21 ఏప్రిల్, 2026

భారతదేశంలో నార్వే రాయబారి మే-ఎలిన్ స్టెనర్, సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పరస్పర సహకారం, ద్వైపాక్షిక అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి.

ఈ భేటీలో నార్వే, తెలంగాణ మధ్య వివిధ రంగాలలో పెట్టుబడులు, సాంకేతిక సహకారంపై ఈ చర్చలు సానుకూల వాతావరణంలో సాగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ (ఆర్పీఓ) జొన్నలగడ్డ స్నేహజ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న ఐటీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో నార్వే భాగస్వామ్యంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నార్వే రాయబారి భేటీ - Tholi Paluku