Let's talk: editor@tmv.in
యాదగిరిగుట్ట ఆలయ నూత‌న‌ పాలక మండలి ఏర్పాటు

యాదగిరిగుట్ట ఆలయ నూత‌న‌ పాలక మండలి ఏర్పాటు

Gaddamidi Naveen
2 జులై, 2026

యాదాద్రి-భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి తెలంగాణ ప్రభుత్వం నూతన పాలక మండలిని (టెంపుల్ బోర్డు) ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది.

నూతన పాలక మండలి చైర్మన్‌గా ఎం. సత్యనారాయణ రెడ్డి నియామకమయ్యారు. బోర్డు సభ్యులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జి. వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిల్లప్పగారి విజయరాజం, విజయేందర్ తుల్లా, పి. ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కాంతమణి, ఎం. రాఘవేందర్ రావు, లక్ష్మీనారాయణ నాయక్‌లతో పాటు ఫౌండర్ ట్రస్టీ నియమితులయ్యారు.

అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, వైటీడీఏ వైస్ చైర్మన్, ఆలయ ఈవో, ఆలయ స్థానాచార్యులు ఇందులో ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఎక్స్-అఫీషియో సభ్యులు, ఫౌండర్ ట్రస్టీ మినహా మిగిలిన బోర్డు సభ్యుల పదవీ కాలం రెండేళ్ల పాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ట్యాగ్‌లు
YadagiriguttaYadadriLakshmiNarasimhaSwamyTelanganaTempleBoardTempleAdministrationYadadriTempleHyderabadDevotionalTelanganaNews
యాదగిరిగుట్ట ఆలయ నూత‌న‌ పాలక మండలి ఏర్పాటు - Tholi Paluku