
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌తో మంత్రి సీతక్క భేటీ
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నూతన చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మి, కమిషన్ ఇతర సభ్యులతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క)ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా, సభ్యులుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించినందుకు గాను వారికి మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రత వారి హక్కుల పరిరక్షణ కోసం మహిళా కమిషన్ మరింత పటిష్టంగా పనిచేయాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, వేధింపులపై తక్షణమే స్పందిస్తూ, వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా కమిషన్ చొరవ చూపాలని సూచించారు. మహిళా సాధికారత సాధనలో, బాధితులకు అండగా నిలవడంలో ప్రభుత్వం తరఫున మహిళా కమిషన్‌కు పూర్తి సహకారం ఉంటుందని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
