Let's talk: editor@tmv.in
విమానాశ్రయ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి రామ్ మోహన్ నాయుడు సమీక్ష

విమానాశ్రయ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి రామ్ మోహన్ నాయుడు సమీక్ష

Panthagani Anusha
24 ఏప్రిల్, 2026

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా డిజిటల్, రియల్‌టైమ్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

కీలక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా

ముఖ్యంగా దేశంలోని మారుమూల ప్రాంతాలు, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులున్న ప్రదేశాల్లో చేపట్టిన విమానాశ్రయ నిర్మాణాల విషయంలో రాజీ పడకూడదని మంత్రి స్పష్టం చేశారు. "ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయడమే మా ప్రాధాన్యత. రవాణా వ్యవస్థలు మెరుగుపడితేనే స్థానిక ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటాయి. తద్వారా ఆయా ప్రాంతాల్లో పెట్టుబడులు పెరగడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని ఆయన పేర్కొన్నారు.

ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశీయ విమానయాన రంగం నూతన పుంతలు తొక్కుతోందని సాంకేతికత, పర్యావరణ సుస్థిరతను మేళవిస్తూ భారతీయ విమానాశ్రయాలు ఇంజనీరింగ్ అద్భుతాలుగా రూపుదిద్దుకుంటున్నాయని ఆయన కొనియాడారు. అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా పారిశ్రామికాభివృద్ధి కూడా వేగవంతం అవుతుందని అధికారులు ఈ సమీక్షలో వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అవరోధాలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పనుల్లో వేగం పెంచేలా ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి వివరించారు.