
మే 4న ఖమ్మంలో మెగా జాబ్ మేళా
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మే 4, సోమవారం ఖమ్మం పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్స్‌లో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
బుధవారం కూసుమంచి మండలం పాలేరులో నిర్వహించిన "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" ప్రజా దర్బార్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి జాబ్ మేళాకు సంబంధించిన ప్రత్యేక సావనీర్‌ను ఆవిష్కరించారు. సుమారు 80కి పైగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఈ మేళాకు హాజరై అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక, సేవా రంగాల్లో ఉద్యోగాలు పొందాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిరుద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఇలాంటి మేళాల ద్వారా స్థానిక యువతకు మెరుగైన భవిష్యత్తు లభిస్తుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
