
తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత నరహరి
నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీలో కీలక నేతగా ఉన్న పసునూరి నరహరి అలియాస్ సంతోష్, తన భార్యతో కలిసి మంగళవారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణకు చెందిన నరహరి, మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఆయన భార్య కూడా అదే సంస్థలో కేడర్‌గా పనిచేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం వెలుపల వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన నలుగురు అగ్రనేతలు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారని పోలీసులు ఇటీవల ప్రకటించారు. వారిలో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, పసునూరి నరహరి కేంద్ర కమిటీ సభ్యులు కాగా, జాడే రత్నబాయి, వర్త శేఖర్ రాష్ట్ర కమిటీ సభ్యులు. తాజా లొంగుబాటుతో ఈ సంఖ్య మరింత తగ్గింది.
మార్చి 2024 నుంచి ఇప్పటివరకు మొత్తం 818 మంది మావోయిస్టులు గతంలో పోలీసులు వెల్లడించారు. సాయుధ పోరాటాన్ని వీడి, ప్రభుత్వ పునరావాస విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని అజ్ఞాతంలో ఉన్న ఇతర నాయకులు, కేడర్‌లకు తెలంగాణ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అగ్రనేతల లొంగుబాటు మావోయిస్ట్ ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
