Let's talk: editor@tmv.in
మైనర్ బాలుడిపై అఘాయిత్యం.. మదరసా టీచర్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన కోర్టు

మైనర్ బాలుడిపై అఘాయిత్యం.. మదరసా టీచర్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన కోర్టు

Gaddamidi Naveen
4 జులై, 2026

మదరసాలో చదువుకుంటున్న 11 ఏళ్ల మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ మదరసా ఉపాధ్యాయుడికి ఇక్కడి స్థానిక న్యాయస్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 10,000 జరిమానా విధిస్తూ గురువారం సంచలన తీర్పునిచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాహీన్ నగర్‌లోని ‘మదరసా జామియా నూరుల్ అన్వర్’ లో బాధితుడైన 11 ఏళ్ల బాలుడు చదువుకునేవాడు. అయితే, సదరు బాలుడు వారం రోజులుగా మదరసాకు వెళ్లకుండా తీవ్ర మానసిక ఆందోళనతో ఉండటాన్ని గమనించిన తండ్రి, గట్టిగా నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

బాలుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనకు నెల రోజుల ముందు మదరసా ఉపాధ్యాయుడు సయ్యద్ నదీమ్ (22) తనను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లి, బట్టలు విప్పించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికి చెప్పినా చంపేస్తానని బెదిరించినట్లు బాలుడు వెల్లడించాడు. దీనిపై బాధితుడి తండ్రి 2022 మార్చి 23న బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర పోలీసులు పక్కా ఆధారాలతో దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన పోక్సో ప్రత్యేక కోర్టు.. నిందితుడు సయ్యద్ నదీమ్ దోషిగా తేలడంతో పోక్సో చట్టం ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద ఈ కఠిన శిక్షను ఖరారు చేసింది.

ట్యాగ్‌లు
HyderabadPOCSOPOCSOActChildSafetyJusticeCrimeNewsBreakingNewsTelanganaHyderabadNewsLawAndJusticeCrimeChildProtectionPolice
మైనర్ బాలుడిపై అఘాయిత్యం.. మదరసా టీచర్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన కోర్టు - Tholi Paluku