Let's talk: editor@tmv.in
బక్రీద్ రోజున సేవలందించిన ముస్లిం డ్రైవర్లకు కామారెడ్డి కలెక్టర్ సన్మానం

బక్రీద్ రోజున సేవలందించిన ముస్లిం డ్రైవర్లకు కామారెడ్డి కలెక్టర్ సన్మానం

Gaddamidi Naveen
29 మే, 2026

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడంతో పాటు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బక్రీద్ పండుగ రోజున కూడా పండుగ వేడుకలను పక్కన పెట్టి, కొనుగోలు కేంద్రాలలో నిరంతరాయంగా ధాన్యం రవాణా సేవలు అందించిన ముస్లిం డ్రైవర్లను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రత్యేకంగా అభినందించారు.

రైతు సంక్షేమమే ధ్యేయంగా అంకితభావంతో పనిచేసిన రవాణా కార్మికులను, డ్రైవర్లను కలెక్టర్ దుస్తులు, నగదు బహుమతులతో ఘనంగా సత్కరించారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ సేవలందిస్తున్న డ్రైవర్ల నిబద్ధతను గుర్తించి, వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ అరుదైన కార్యక్రమం ప్రభుత్వానికి రైతుల సంక్షేమం, వేగవంతమైన కొనుగోలు ప్రక్రియలపై ఉన్న పట్టుదలతో పాటు సమాజంలో మతసామరస్య స్ఫూర్తిని చాటిచెప్పింది. ఈ సత్కార కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ట్రాన్స్‌పోర్టర్లు, మిల్లు ప్రతినిధులు, పెద్దసంఖ్యలో డ్రైవర్లు పాల్గొన్నారు.