Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ ‘24 గంటల కౌంట్‌డౌన్’ మహోత్సవ్
హైదరాబాద్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ ‘24 గంటల కౌంట్‌డౌన్’ మహోత్సవ్
హైదరాబాద్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ ‘24 గంటల కౌంట్‌డౌన్’ మహోత్సవ్

హైదరాబాద్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ ‘24 గంటల కౌంట్‌డౌన్’ మహోత్సవ్

Gaddamidi Naveen
21 జూన్, 2026

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒక రోజు ముందుగా, శనివారం ఉదయం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నేతృత్వంలో ‘యోగా మహోత్సవ్ - 24 గంటల కౌంట్‌డౌన్’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొని, సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఎంత శక్తివంతమైనదో చాటిచెప్పారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరంతర కృషి ఫలితంగానే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో గత ఏడేళ్లుగా ఈ కౌంట్‌డౌన్ వేడుకలను నిర్వహిస్తున్నామని, నేటి కార్యక్రమంలో 10 వేల మందికి పైగా యోగా ప్రేమికులతో పాటు 45 మంది విదేశీ ప్రతినిధులు కూడా పాల్గొనడం విశేషమని ఆయన పేర్కొన్నారు.

యోగాతో మారిన జీవితాలు

నటుడు నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. యోగా వల్ల తన జీవితంలో సానుకూల మార్పులు వచ్చాయని, ‘యోగా సే హోగా’ అనే ప్రధాని మాటలను స్ఫూర్తిగా తీసుకుని యువత దీనిని తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని కోరారు. నటి పాయల్ రాధాకృష్ణ పొద్దున్నే 6 గంటలకే పరేడ్ గ్రౌండ్స్ అంతా యోగా ప్రేమికులతో నిండిపోవడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనల్లో సైతం వారు యోగా గురించి మాట్లాడుతుంటారని, మన దేశ సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరూ నిత్యం సాధన చేయాలని ఆమె పిలుపునిచ్చారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ, ప్రధాని మోడీ, కిషన్ రెడ్డిల ప్రేరణతో గత ఏడాదిన్నరగా యోగా చేయడం వల్లే తన బరువు 118 కేజీల నుంచి 80 కేజీలకు తగ్గిందని సంతోషం వ్యక్తం చేశారు.

ఐక్యరాజ్యసమితి ప్రకారం, 2026 సంవత్సరం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు వేదికైంది. ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. అన్ని వయసుల వారు చురుగ్గా, స్వతంత్రంగా, ఆరోగ్యంగా జీవించడానికి యోగా ఏ విధంగా తోడ్పడుతుందనే అంశాన్ని ఈ థీమ్ హైలైట్ చేస్తుంది.

ఈ కార్యక్రమంలో కామన్ యోగా ప్రోటోకాల్ సాధనను అందరూ కలిసి వీక్షించి, ఆచరించారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, ఎంపీలు డాక్టర్ లక్ష్మణ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పద్మ అవార్డు గ్రహీతలు హాజరయ్యారు.

ట్యాగ్‌లు
InternationalYogaDayYogaDay2026YogaForHealthyAgeingYogaMahotsavYogaForWellnessYogaForLifeYogaEverydayYogaSeHogaInternationalDayOfYogaHealthyLifestyle
హైదరాబాద్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ ‘24 గంటల కౌంట్‌డౌన్’ మహోత్సవ్ - Tholi Paluku