Let's talk: editor@tmv.in
‘ఇడుపు కాయితం’ అర్థం కావాలంటే పవన్‌ను అడగండి: కవిత

‘ఇడుపు కాయితం’ అర్థం కావాలంటే పవన్‌ను అడగండి: కవిత

Gaddamidi Naveen
29 జూన్, 2026

తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కుతున్న 'ఇడుపు కాయితం' సినిమా టైటిల్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత ఘాటుగా స్పందించారు. ఈ పదం యొక్క అసలు అర్థం ఏమిటో తెలియాలంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని అడిగితే అర్థమవుతుందని ఆమె ఎద్దేవా చేశారు.

తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇక్కడి భాషను, సంస్కృతిని అవమానిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని కవిత మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వం, భాషపై నిరంతరం దాడి జరుగుతుంటే.. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు కనీసం స్పందించకుండా మౌనం వహించడం అత్యంత సిగ్గుచేటని ఆమె తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం ఉప్పల్ పిస్తా హౌస్ చౌరస్తాలో టీఆర్ఎస్ జెండా ఎగురవేసిన కవిత మన ఉద్యమకారుల కోసం మేము ఎల్లప్పుడూ ముందుండి పోరాడతామ‌ని తెలిపారు. జూలై 2న ఉప్పల్ భగాయత్‌లో భారీ భూపోరాటం చేయనున్నట్లుగా కవిత ప్రకటించారు.

వివాదానికి కార‌ణం ఇలా...

హీరో ప్రియదర్శి, నాగదుర్గ జంటగా పక్కా తెలంగాణ సంస్కృతి, గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘ఇడుపు కాయితం’. అయితే, ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే దీని 'టైటిల్' సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చకు, వివాదానికి దారితీసింది. ఈ టైటిల్‌పై నెట్టింట ఆంధ్రా, తెలంగాణ నెటిజన్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆంధ్రప్రాంతానికి చెందిన కొందరు నెటిజన్లు ఈ పేరు వింతగా ఉందంటూ, తెలంగాణ యాసను, పదజాలాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో ట్రోలింగ్, మీమ్స్ చేయడం ప్రారంభించారు. తెలంగాణ జనజీవనంలో, ఇక్కడి యాసలో ఉన్న ఒక అచ్చమైన పదనిర్మాణమని స్పష్టం చేస్తున్నారు.

భాష తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి కానీ, ఇలా ఒక ప్రాంత సంస్కృతిని, యాసను హేళన చేయడం సరికాదంటూ ట్రోలర్లకు గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. ఈ వివాదంతో సినిమాపై ఇండస్ట్రీలో ఇప్పుడే అంచనాలు, ఆసక్తి ఒక్కసారిగా పెరిగాయి. ఈ క్రమంలోనే ‘ఇడుపు కాగితం’ పదానికి అర్థం పవన్ కల్యాణ్‌ను అడిగితే బాగా చెబుతాడంటూ ఆమె ఎద్దేవా చేశారు.

ట్యాగ్‌లు
TelanganaCultureRevanthReddyPawanKalyanPoliticalNewsTeluguNewsBreakingNewsTrendingNowViralNewsHyderabadTelanganaPolitics
‘ఇడుపు కాయితం’ అర్థం కావాలంటే పవన్‌ను అడగండి: కవిత - Tholi Paluku