
నీ నాలుక కోస్తా.. ఇంటికొచ్చి దాడి చేస్తా: శివసేన ఎమ్మెల్యే
మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై వచ్చిన ఒక పుస్తకం విషయంలో ప్రచురణకర్తపై తాను మాట్లాడిన వ్యాఖ్యలపై గైక్వాడ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కొల్హాపూర్‌కు చెందిన ప్రచురణకర్త ప్రశాంత్ అంబిపై గైక్వాడ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. ‘శివాజీ కోన్ హోతా’ అనే పుస్తకం విషయంపై ఈ వివాదం తలెత్తింది. ఈ పుస్తకాన్ని కమ్యూనిస్టు నేత గోవింద్ పంసారే చించారు. 1988లో తొలిసారి ప్రచురితమైన ఈ గ్రంథం విస్తృతంగా పాఠకాదరణ పొందింది. ఈ నేపథ్యంలో గైక్వాడ్ మాట్లాడుతూ ప్రచురణకర్తపై నేను చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై నేను విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. అయితే, పుస్తకంలో కొన్ని చోట్ల శివాజీ మహారాజును గౌరవంగా సంబోధించలేదని ఆరోపించారు. పుస్తకంపై నాకు అభ్యంతరం లేదు. కానీ ప్రచురించిన వారు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను గౌరవంగా పేర్కొనాలని స్పష్టం చేశారు. వైరల్ అయిన ఆడియో క్లిప్‌లో ఉన్న స్వరం తనదేనని గైక్వాడ్ అంగీకరించినప్పటికీ, అది ఎడిట్ చేసి వక్రీకరించారని పేర్కొన్నారు.
ఎందుకు చర్యలు తీసుకోలేదు?
ఇదిలా ఉండగా, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ తీవ్రంగా స్పందించారు. గైక్వాడ్ వ్యాఖ్యలు ఆయన నేరపూరిత మనస్తత్వాన్ని సూచిస్తున్నాయని ఆరోపిస్తూ, ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చురణకర్త అంబి ఆరోపణల ప్రకారం, గైక్వాడ్ ఫోన్ చేసి పుస్తక శీర్షికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తనను బెదిరించారని తెలిపారు. నీ నాలుక కోస్తా… ఇంటికి వచ్చి దాడి చేస్తా… నువ్వూ పంసారేలాగే అవుతావు అంటూ బెదిరించాని ఆరోపించారు.
లోక్‌వాంగ్మయ గృహ ప్రచురించిన ఈ పుస్తకం ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను కేవలం హిందూ రాజుగా కాకుండా, ప్రజల రాజుగా, సెక్యులర్ నాయకుడిగా చూపిస్తూ రాసిన ప్రముఖ గ్రంథంగా నిలిచింది. ఇది లక్షల కాపీలు అమ్ముడవడంతో పాటు 75కి పైగా ముద్రణలు పొందింది.
