Let's talk: editor@tmv.in
హైడ్రా భారీ ఆపరేషన్... ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం
హైడ్రా భారీ ఆపరేషన్... ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం
హైడ్రా భారీ ఆపరేషన్... ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం

హైడ్రా భారీ ఆపరేషన్... ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం

Gaddamidi Naveen
25 జూన్, 2026

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి హైడ్రా రక్షించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలోని సర్వే నంబర్ 42లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిపై కొందరు అక్రమంగా హక్కులు చెలాయించే ప్రయత్నం చేసినట్లు అధికారులు గుర్తించారు. మెటల్ చార్మినార్ నుంచి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న ఈ భూమి మార్కెట్ విలువ సుమారు రూ.1,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

ఆక్రమణదారులు భూమిలో రెండు తాత్కాలిక షెడ్లు నిర్మించడంతో పాటు ఒక గదిని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, మొత్తం స్థలాన్ని రేకుల షీట్లతో చుట్టుముట్టి ప్రహరీ నిర్మించే ప్రయత్నాలు చేశారు. ఈ విషయంపై రెవెన్యూ శాఖ నుంచి ఫిర్యాదు అందడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా, అక్రమంగా నిర్మించిన షెడ్లు, గది, ఫెన్సింగ్‌ను హైడ్రా బృందాలు తొలగించాయి. అనంతరం భూమి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉందని స్పష్టం చేస్తూ ఐదు ఎకరాల స్థలం చుట్టూ కొత్త ఫెన్సింగ్ ఏర్పాటు చేశాయి. అలాగే ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశాయి. ఈ చర్యతో ఐటీ కారిడార్ ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తిని కాపాడినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు
HYDRAHyderabadITCorridorKhanametGovernmentLandLandProtectionEncroachmentFreeRangaReddySherilingampallyHitechCityHyderabadNews
హైడ్రా భారీ ఆపరేషన్... ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం - Tholi Paluku