Let's talk: editor@tmv.in
గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యం, వసతులే ముఖ్యం: జిల్లా కలెక్టర్ల ఆదేశం
గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యం, వసతులే ముఖ్యం: జిల్లా కలెక్టర్ల ఆదేశం

గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యం, వసతులే ముఖ్యం: జిల్లా కలెక్టర్ల ఆదేశం

Gaddamidi Naveen
21 ఏప్రిల్, 2026

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు గురుకుల పాఠశాలలను సందర్శించి, విద్యార్థుల ఆరోగ్యం, వసతులపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ నివాస పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నివాస పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. కిచెన్, స్టోర్ రూమ్‌లు, క్లాస్ రూమ్‌లు, హాస్టల్ గదులను అత్యంత పరిశుభ్రంగా ఉంచాలి. డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. డైట్ చార్ట్ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. విద్యార్థులకు ఏదైనా అనారోగ్యం కలిగితే వెంటనే వైద్య సాయం అందేలా చూడాలి. చిన్న పిల్లల పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సందర్భంగా 2026 ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ పతకాలను ప్రదానం చేశారు.

మంచిర్యాల జిల్లా..

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ రాజీవ్ నగర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను కోరారు. అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను సమీక్షించారు. విద్యార్థులకు సమయానికి పోషకాహారం అందించాలన్నారు. వంటగది, స్టోరేజ్ పరిశుభ్రతను తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణను సమీక్షించారు. ఆదర్శ పాఠశాలలో హాస్టల్ పనులను కూడా పరిశీలించారు. అదేవిధంగా జిల్లాలో రూ.129.25 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి రూ.23.75 కోట్లతో చేపట్టిన క్రిటికల్ కేర్ యూనిట్ పనులను త్వరగా, నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.

గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యం, వసతులే ముఖ్యం: జిల్లా కలెక్టర్ల ఆదేశం - Tholi Paluku