Let's talk: editor@tmv.in
అత్యాధునిక హంగులతో ముస్తాబైన హఫీజ్‌పేట రైల్వే స్టేషన్
అత్యాధునిక హంగులతో ముస్తాబైన హఫీజ్‌పేట రైల్వే స్టేషన్

అత్యాధునిక హంగులతో ముస్తాబైన హఫీజ్‌పేట రైల్వే స్టేషన్

Gaddamidi Naveen
2 మే, 2026

దేశవ్యాప్త రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా, తెలంగాణలోని హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ అత్యాధునిక హంగులతో పునరాభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రూ.29.21 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ఆధునికీకరణ పనులు ఇప్పటికే 99 శాతం పూర్తయ్యాయని ఆయన ఎక్స్ వేదిక‌గా పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 12 మీటర్ల వెడల్పు ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్ (రాంప్‌తో), కవర్‌డ్ ప్లాట్‌ఫార్మ్, ఆధునిక మరుగుదొడ్లు, కొత్త స్టేషన్ భవనం, సర్క్యులేటింగ్ ఏరియా, ప్లాట్‌ఫార్మ్ రీసర్ఫేసింగ్, సైన్‌బోర్డులు ఏర్పాటు చేశారు. అదనంగా రెండు లిఫ్ట్‌లు, రెండు ఎస్కలేటర్లు ఏర్పాటు చేసి ప్రయాణికుల సౌలభ్యాన్ని పెంచుతున్నారు. భారతీయ రైల్వే మౌలిక సదుపాయాలను మార్చడానికి, కనెక్టివిటీని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. త్వరలోనే ఈ స్టేషన్ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.