Let's talk: editor@tmv.in
ఆందోల్‌లో రూ.16 కోట్ల రోడ్ల అభివృద్ధికి గ్రీన్‌సిగ్నల్

ఆందోల్‌లో రూ.16 కోట్ల రోడ్ల అభివృద్ధికి గ్రీన్‌సిగ్నల్

Gaddamidi Naveen
27 జూన్, 2026

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నిరంతర కృషి, ప్రత్యేక చొరవతో ఆందోల్ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం భారీ నిధులను మంజూరు చేసింది. చౌటకూర్ మండలంలోని హెచ్ఎంఆర్ పరిధిలోకి వచ్చే 5 రెవెన్యూ గ్రామాలలో రోడ్ల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం తాజాగా పరిపాలనా అనుమతులు ఇచ్చింది.

మొత్తం రూ. 16 కోట్ల అంచనా వ్యయంతో ఈ గ్రామాల్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ల (నాలా) నిర్మాణ పనులను చేపట్టనున్నారు. దీనివల్ల వెంకటకిష్టాపూర్, లింగంపల్లి, కోర్పోల్, శివంపేట్, వెండికోల్ గ్రామాల ప్రజలకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెరుగైన రవాణా, రహదారి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

ప్రతిపాదిత పనుల్లో వెంకటకిష్టాపూర్ నుంచి లింగంపల్లి వరకు 3 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.4.50 కోట్లు, ఎన్‌హెచ్–161 నుంచి సుల్తాన్‌పూర్–కోర్పోల్ వరకు 3 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు కేటాయించారు. అలాగే శివంపేట్ గ్రామంలో 0.50 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ల నిర్మాణానికి రూ.1 కోటి మంజూరు చేశారు. ఎన్‌హెచ్–161 నుంచి శివంపేట్–వెండికోల్ వరకు 5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.6.50 కోట్లు కేటాయించారు.

హెచ్‌ఎంఆర్ పరిధిలో ఇటీవల విలీనమైన గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పనులు కీలకంగా మారనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు ప్రయాణ సౌలభ్యం పెరగడంతో పాటు స్థానిక అభివృద్ధికి ఊతం లభిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆందోల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా మంత్రి దామోదర్ రాజనరసింహ నిరంతరం కృషి చేస్తున్నారని వెల్లడించారు.

ట్యాగ్‌లు
AndoleAndoleConstituencyTelanganaTelanganaNewsRoadDevelopmentInfrastructureDevelopmentPublicInfrastructureRuralDevelopmentGoodGovernance
ఆందోల్‌లో రూ.16 కోట్ల రోడ్ల అభివృద్ధికి గ్రీన్‌సిగ్నల్ - Tholi Paluku