Let's talk: editor@tmv.in
తెలంగాణ మహిళా కమిషన్ నూతన ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి

తెలంగాణ మహిళా కమిషన్ నూతన ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి

Gaddamidi Naveen
12 మే, 2026

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కమిషన్ ఛైర్‌పర్సన్‌తో పాటు మరో ఆరుగురు సభ్యులను నియమిస్తూ సోమ‌వారం ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 637ను విడుదల చేసింది. మహిళల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సాధికారత లక్ష్యంగా 1998 మహిళా కమిషన్ చట్టం ప్రకారం ఈ నియామకాలు జరిగాయి.

ఈ ఉత్తర్వుల ప్రకారం గద్వాల విజయలక్ష్మి రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. ఇందులో సభ్యులుగా శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవ రెడ్డి, సదాలక్ష్మి, ఎన్. రాధాబాయి, ఉజ్మా అషాయి షకీరాలను ప్రభుత్వం నియమించింది. ఇక ఇప్పటి వరకు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద ఉంన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారంలో ఈ నూతన కమిషన్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ కమిషన్‌ ఐదేళ్ల పాటు కొనసాగనుంది.