Let's talk: editor@tmv.in
నీట్ రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం

నీట్ రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం

Gaddamidi Naveen
17 జూన్, 2026

జూన్ 21న దేశవ్యాప్తంగా జరగనున్న ‘నీట్’ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించనుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ నీట్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్‌ను చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి తెలిపారు. నీట్ అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందన్నారు. విద్యార్థుల రద్దీకి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన చోట్ల అదనపు బస్సు సర్వీసులను కూడా నడపనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు.