Let's talk: editor@tmv.in
ఘోర రోడ్డు ప్రమాదం.. బొగ్గు లారీ ఢీకొట్టడంతో డీటీఓ వెంకన్న మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. బొగ్గు లారీ ఢీకొట్టడంతో డీటీఓ వెంకన్న మృతి

Gaddamidi Naveen
23 జూన్, 2026

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న జిల్లా రవాణా అధికారి (డీటీఓ) వెంకన్న (55) అతివేగంగా వచ్చిన బొగ్గు టిప్పర్ లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చేల్పూర్ లోని ఆర్‌టీఓ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. అధికారులు సీజ్ చేసిన ఒక హార్వెస్టర్ వాహనాన్ని కార్యాలయ ప్రాంగణంలోకి సురక్షితంగా తరలించేందుకు డీటీఓ వెంకన్న రోడ్డుపై ఇతర వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఆ సమయంలో ఆయన తన కారు పక్కన నిలబడి ఉండగా, బొగ్గు లోడ్‌తో అతివేగంగా వచ్చిన ఒక లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వాహనాన్ని నడుపుతూ వెంకన్నను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాద తీవ్రతకు ఆయనకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

విధి నిర్వహణలో ఉన్న డీటీఓ ఎం. వెంకన్న మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రవాణా శాఖ జాయింట్ కమిషనర్‌ను ఆదేశించారు. వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు.

విధి నిర్వహణలో ఉంటూ ప్రాణాలు కోల్పోయిన వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ, ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో లేడని పోలీసులు స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు
TelanganaJayashankarBhupalpallyDTOTransportDepartmentRoadAccidentRoadSafetyBreakingNewsTelanganaNewsHyderabadNewsChelpurVenkannaRTO
ఘోర రోడ్డు ప్రమాదం.. బొగ్గు లారీ ఢీకొట్టడంతో డీటీఓ వెంకన్న మృతి - Tholi Paluku