Let's talk: editor@tmv.in
FASTag వినియోగదారులకు శుభవార్త

FASTag వినియోగదారులకు శుభవార్త

Saikiran Y
19 అక్టోబర్, 2025

FASTag వార్షిక పాస్ ద్వారా జాతీయ రహదారులు ఇంకా ఎక్స్‌ప్రెస్‌వేలపై ఏడాది పొడవునా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. నిరాటంకమైన ప్రయాణం అందించడానికి రూపొందించబడిన ఈ పాస్‌ను ఇప్పుడు రాజ్‌మార్గయాత్ర (Rajmargyatra) యాప్ ద్వారా ఈ దీపావళికి బహుమతిగా కూడా ఇవ్వవచ్చు.

వినియోగదారులు యాప్‌లో 'యాడ్ పాస్' అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, స్వీకరించే వారి వాహనం నంబర్, సంప్రదింపు వివరాలను నమోదు చేసి, ఓటిపి (OTP) ని ఎంటర్ చెయ్యాలి. ఇది పూర్తయిన తర్వాత, ఎంచుకున్న వాహనంపై FASTag వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుంది, ఇది దేశవ్యాప్తంగా సుమారు 1,150 టోల్ ప్లాజాలలో సాఫీగా ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది.

ఈ వార్షిక పాస్ తరచుగా FASTag రీఛార్జ్‌లు చేసుకునే వారికి ప్రత్యామ్నాయంగా, ₹3,000 ఒకేసారి రుసుముతో, ఒక సంవత్సరం లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్‌లకు చెల్లుబాటు అయ్యే ఆర్థిక పరిష్కారాన్ని అందిస్తుంది. ఇది చెల్లుబాటు అయ్యే FASTag ఉన్న అన్ని వాణిజ్యేతర (non-commercial) వాహనాలకు వర్తిస్తుంది మరియు రాజ్‌మార్గయాత్ర యాప్ ద్వారా చెల్లింపు చేసిన రెండు గంటల్లోపు యాక్టివేట్ అవుతుంది.

ఆగస్ట్ 15, 2025న ప్రారంభించినప్పటి నుండి, FASTag వార్షిక పాస్ గణనీయమైన ఆదరణ పొందింది, కేవలం రెండు నెలల్లోనే 25 లక్షల మందికి సేవలను అందించింది, అంతే కాకుండా 5.67 కోట్లకు పైగా లావాదేవీలు నమోదు అయ్యాయి. ఈ అద్భుతమైన స్పందన జాతీయ రహదారి వినియోగదారులకు అందిస్తున్న సౌలభ్యం.

నిరాటంకంగా, ఆర్థికంగా, పండుగలకు అనుకూలంగా ప్రయాణించే వారికి – FASTag వార్షిక పాస్ ఒక సరైన దీపావళి బహుమతి అని చెప్పుకోవాలి.

FASTag వినియోగదారులకు శుభవార్త - Tholi Paluku