Let's talk: editor@tmv.in
సామాజిక సేవలో అందరూ భాగస్వాములు కావాలి: చంద్రబాబు నాయుడు

సామాజిక సేవలో అందరూ భాగస్వాములు కావాలి: చంద్రబాబు నాయుడు

Panthagani Anusha
21 ఏప్రిల్, 2026

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం విజయవాడలోని ఒక అన్నా క్యాంటీన్‌ను సందర్శించిన భువనేశ్వరి, సీఎం చంద్రబాబు అక్కడ పేదలకు స్వయంగా అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం వారితో కలిసి కూర్చుని అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా ప్రారంభమైన అన్నా క్యాంటీన్లకు అండగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి పుట్టినరోజున ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతృప్తిని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు.

స్ఫూర్తిగా తీసుకోవాలి: ముఖ్యమంత్రి పిలుపు

భువనేశ్వరి అందించిన విరాళంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా భువనేశ్వరి రూ.76 లక్షలు విరాళంగా ఇవ్వడం అభినందనీయమని దీన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆకాంక్షించారు.అన్నదానం అనేది అత్యంత పవిత్రమైన కార్యం. రాష్ట్రంలోని అన్నా క్యాంటీన్లు ఎంతోమంది నిరుపేదల ఆకలి తీరుస్తున్నాయి. ప్రజలు కూడా తమ కుటుంబ వేడుకలు, పుట్టినరోజులు లేదా శుభకార్యాల సందర్భంగా తమ పరిధిలోని అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చి పేదలకు అండగా నిలవాలి అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

సామాజిక సేవలో అందరూ భాగస్వాములు కావాలి: చంద్రబాబు నాయుడు - Tholi Paluku