Let's talk: editor@tmv.in
తిరుపతి శ్రీ వెంకటేశ్వర ‘జూ’కు రూ.21 లక్షల విరాళం

తిరుపతి శ్రీ వెంకటేశ్వర ‘జూ’కు రూ.21 లక్షల విరాళం

Panthagani Anusha
18 ఏప్రిల్, 2026

తిరుపతి శ్రీ వేంకటేశ్వర జూలాజికల్ పార్క్‌కు జంతు దత్తత పథకం కింద శుక్రవారం రూ.21 లక్షల విరాళం అందింది. పంజాబ్‌కు చెందిన ఓ సేవా సంస్థ వన్యప్రాణుల సంరక్షణకు మద్దతుగా ఈ మొత్తాన్ని అందించినట్లు జూ అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా జూ క్యూరేటర్ సి.సెల్వం విడుదల చేస్తూ జంతు దత్తత పథకానికి లభించిన ఈ విరాళం జంతువుల సంక్షేమం, సంరక్షణ కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అందిన నిధులను పార్క్‌లోని జంతువుల పోషణ, నిర్వహణ, వైద్య సేవల కోసం వినియోగించనున్నట్లు వివరించారు.

ఇలాంటి విరాళాలు వన్యప్రాణుల సంరక్షణ లో కీలక పాత్ర పోషిస్తాయని, జంతువుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడతాయని ఆయన తెలిపారు. జంతు దత్తత పథకం ద్వారా దీర్ఘకాలిక సంరక్షణ చర్యలను బలోపేతం చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

వ్యక్తులు, సంస్థలు, కార్పొరేట్ సంస్థలు జంతు దత్తత పథకంలో భాగస్వామ్యం కావాలని వన్యప్రాణుల సంక్షేమానికి తోడ్పడాలని జూ అధికారులు పిలుపునిచ్చారు.