Let's talk: editor@tmv.in
అందోల్-జోగిపేటలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ

అందోల్-జోగిపేటలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ

Gaddamidi Naveen
21 ఏప్రిల్, 2026

అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమ‌వారం వార్డు నంబర్ 10లో నూతనంగా నిర్మించిన ఒక ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అందోల్-జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో లబ్ధిదారునికి కేటాయించిన ఇంటిని ఆయన ప్రారంభించి, గృహప్రవేశం చేయించారు. తమకు పక్కా ఇల్లు లభించడం పట్ల లబ్ధిదారులు మంత్రితో తమ సంతోషాన్ని పంచుకుంటూ, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లే నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని స్థానికులు కొనియాడారు. మున్సిపాలిటీ పరిధిలో చాలా ఇళ్లు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే మిగిలిన లబ్ధిదారులకు కూడా ఇళ్లను అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు. సొంతింటి యజమానులైన పేద కుటుంబాల్లో ఈ ఇందిరమ్మ ఇళ్లు కొత్త వెలుగులు నింపుతున్నాయి. మౌలిక సదుపాయాలతో కూడిన నాణ్యమైన గృహాలను అందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అందోల్-జోగిపేటలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ - Tholi Paluku