Let's talk: editor@tmv.in
గిరిజన ప్రాంతాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: మంత్రి సంధ్యారాణి

గిరిజన ప్రాంతాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: మంత్రి సంధ్యారాణి

Gaddamidi Naveen
8 జులై, 2026

ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. మంగళవారం అమరావతి సచివాలయం 3వ బ్లాక్‌లో గిరిజన ఇంజనీరింగ్ విభాగంపై ఆమె ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పీఎం జన్మన్, డీఏ గూగా, ఆర్టికల్-275, ఉపాధి హామీ, ఎస్ఏఎస్‌సీఐ పథకాల కింద మంజూరైన నిధులు, వాటి వ్యయం, పనుల పురోగతిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో మొత్తం రూ. 1,049 కోట్లతో భారీ ఎత్తున అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆమె వెల్లడించారు.

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అరకు ఐటీడీఏకు రూ.257 కోట్లు, సీతంపేటకు రూ.163 కోట్లు, పార్వతీపురానికి రూ.154 కోట్లు, పాడేరుకు రూ.134 కోట్లు, రంపచోడవరానికి రూ.112 కోట్లు, శ్రీశైలానికి రూ.44 కోట్లు, చింతూరుకు రూ.34 కోట్లు, నెల్లూరుకు రూ.19 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. మొత్తం రూ.1,049 కోట్లతో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

ఐటీడీఏల వారీగా నిధుల వినియోగాన్ని మరింత వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంజూరైన నిధులను వంద శాతం వినియోగించుకుంటూ, ఎక్కడా రాజీ పడకుండా అత్యంత నాణ్యతా ప్రమాణాలతో పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, పనుల పురోగతికి సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు తనకు సమర్పించాలని మంత్రి సంధ్యారాణి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ట్యాగ్‌లు
GummidiSandhyaRaniTribalWelfareAndhraPradeshAPGovernmentTribalDevelopmentITDAPMJANMANMGNREGSArticle275
గిరిజన ప్రాంతాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: మంత్రి సంధ్యారాణి - Tholi Paluku