
బెంగాల్‌లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవదు: అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం డమ్‌డమ్‌లో జరిగిన ఎన్నికల సభలో కాంగ్రెస్, టీఎంసీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని, మమతా బెనర్జీ కాంగ్రెస్‌కు దగ్గరవడం ఆమె రాజకీయ పతనాన్ని వేగవంతం చేస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూ, తమిళనాడు, పుదుచ్చేరిలో డబుల్ డిజిట్ దాటలేరని, బెంగాల్‌లో ఖాతా కూడా తెరవలేరని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజకీయ భాషను దిగజార్చారని ఆరోపించారు.
మమతాపై మాటల దాడి
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో చేతులు కలపడం పెద్ద తప్పిదమని షా అన్నారు. బెంగాల్‌కు ఔట్‌సైడర్ సీఎం వస్తాడని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. బెంగాల్‌కి చెందిన, బెంగాలీ మాట్లాడే బీజేపీ నాయకుడే సీఎం అవుతాడని చెప్పారు. మమతా తన మేనల్లుడిని సీఎం చేయాలనే లక్ష్యంతో ఉన్నారని ఆరోపించారు.
‘సిండికేట్ రాజ్’, మహిళల భద్రత
కోల్‌కత్తా పరిసరాల్లో ఉన్న ‘సిండికేట్ రాజ్’, దందాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ప్రస్తావిస్తూ, మే 5 తర్వాత ఈ పరిస్థితులకు తెరపడుతుందని హామీ ఇచ్చారు. మహిళల భద్రతపై టీఎంసీ వైఖరిని విమర్శిస్తూ, రాత్రి 7 తర్వాత బయటకు రావొద్దన్న వ్యాఖ్యలను ప్రస్తావించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ, టీఎంసీ నేత హుమాయున్ కబీర్ పేరుతో బాబ్రీ మసీదు నిర్మించాలని మమతా చూస్తున్నారని షా ఆరోపించారు. బెంగాల్‌లో అలాంటి ప్రయత్నాన్ని బీజేపీ అనుమతించదని స్పష్టం చేశారు.
చొరబాట్ల అంశం ప్రధాన అజెండా
బెంగాల్‌లో చొరబాట్ల సమస్యను ప్రధాన ఎన్నికల అంశంగా నిలిపిన షా ఎమ్మెల్యే కోసం కాదు, చొరబాట్ల రహిత బెంగాల్ కోసం ఓటేయాలని పిలుపునిచ్చారు. మహిళల రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, టీఎంసీలు వ్యతిరేకించాయని కూడా ఆరోపించారు. మే 4 కౌంటింగ్ తర్వాత ప్రజలు ‘దీదీ’కి వీడ్కోలు పలుకుతారని వ్యాఖ్యానించారు.
