Let's talk: editor@tmv.in
సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు.. పలువురికి గాయాలు

సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు.. పలువురికి గాయాలు

Gaddamidi Naveen
9 జులై, 2026

సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మండలం ఆర్వపల్లి వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నల్గొండ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గాల మధ్య మండల కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకాన్ని ఏకపక్షంగా చేపట్టారనే ఆరోపణల నేపథ్యంలో వివాదం చెలరేగింది.

సమాచారం ప్రకారం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రామ్‌రెడ్డి దామోదర్ రెడ్డి వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన కార్యకర్తలు వారి వాహనాలను అడ్డుకుని రాళ్లు, కర్రలతో దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా గాయపడగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించిన పోలీసు సిబ్బందికీ గాయాలయ్యాయి. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

ట్యాగ్‌లు
CongressTelanganaSuryapetJajireddygudemArvapallyPoliticalClashBreakingNewsTeluguNewsCongressLeadersLawAndOrderNalgonda
సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు.. పలువురికి గాయాలు - Tholi Paluku