Let's talk: editor@tmv.in
గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

Panthagani Anusha
26 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రాజ్‌భవన్‌ను (లోక్ భవన్) సందర్శించారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

గవర్నర్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కొద్దిసేపు గవర్నర్‌తో మాట్లాడిన చంద్రబాబు వైద్యులు అందిస్తున్న చికిత్స, ప్రస్తుతం తీసుకుంటున్న విశ్రాంతి తదితర అంశాలపై ఆరా తీశారు. గవర్నర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని త్వరలోనే పూర్తిస్థాయిలో విధులకు హాజరు కావాలని తాను ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పరామర్శ పట్ల గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సంతోషం వ్యక్తం చేశారు. బిజీ షెడ్యూల్‌లోనూ తన ఆరోగ్యంపై శ్రద్ధ వహించి నేరుగా వచ్చి పరామర్శించినందుకు ముఖ్యమంత్రికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.