Let's talk: editor@tmv.in
డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ

Gaddamidi Naveen
3 మే, 2026

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం పరామర్శించారు. గత కొన్ని రోజులుగా స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నేరుగా పవన్ నివాసానికి వెళ్లి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

సీఎం, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజకీయ, పాలనాపరమైన ఒత్తిడి పక్కన పెట్టి, మరికొద్ది రోజులు తగిన విశ్రాంతి తీసుకోవాలని పవన్‌కు చంద్రబాబు సూచించారు.ఈ భేటీ సందర్భంగా ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంది.