Let's talk: editor@tmv.in
కుప్పంలో శ్రీప్రసన్న గంగమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు దంపతులు

Gaddamidi Naveen
21 మే, 2026

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు బుధవారం చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రముఖ శ్రీ ప్రసన్న గంగమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముఖ్యమంత్రి తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం అర్చకులు సీఎం దంపతులకు ఘనంగా సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దీనితో పాటు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదాన్ని కూడా ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారికి సమర్పించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. పూజల అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక అధికారులు, నాయకులు కూడా హాజరయ్యారు.

చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు.. మార్గంమధ్యలో రోడ్డుపక్కన ఆగి తాటిముంజలు తిన్నారు. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించిన తర్వాత తిరుగు ప్రయాణంలో తంజమ్మకొట్టాలు వద్ద కల్లు గీత కార్మికులు తాటి ముంజలు తీస్తుండటాన్ని గమనించి ఆగారు. దీనికి సంబంధించిన ఫొటోలను చంద్రబాబు, భువనేశ్వరి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

కల్తీ లేదు… కార్బైడ్ లేదు… పురుగు మందుల సమస్య లేదు… కుప్పం ప్రజల మనసుల్లా స్వచ్ఛమైన, చల్లని తాటి ముంజలు రోడ్డు పక్కన ఆగి తింటుంటే ఎంతో హాయిగా అనిపించిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మన గ్రామీణ ఆహార ఉత్పత్తులకు మించింది ఏముంటుంది!అని ఆయ‌న‌ పేర్కొన్నారు. ప్రకృతి సిద్ధమైన ఈ స్థానిక ఆహారాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు.