Let's talk: editor@tmv.in
ఢిల్లీకి బీఆర్‌ఎస్‌ పార్టీ త్రిసభ్య బృందం

ఢిల్లీకి బీఆర్‌ఎస్‌ పార్టీ త్రిసభ్య బృందం

Gaddamidi Naveen
21 ఏప్రిల్, 2026

పార్టీ ఫిరాయింపులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ త్రిసభ్య బృందం ఢిల్లీకి చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు.

ఈ బృందం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో కీలక భేటీ నిర్వహించింది. ఏప్రిల్ 22న కాళేశ్వరం కమిషన్‌పై తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో, ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలపై లాయర్లతో చర్చిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు అనుసరించాల్సిన తదుపరి న్యాయపరమైన కార్యాచరణను ఈ బృందం సిద్ధం చేస్తోంది.

జగిత్యాల సభకు హరీష్ రావు దూరంగా ఉండటంపై విమర్శలు వస్తున్నప్పటికీ, పార్టీ పరంగా అత్యంత కీలకమైన ఈ న్యాయపరమైన బాధ్యతలకు ఆయన ఢిల్లీలో పర్యటిస్తున్నారు. హైకోర్టు తీర్పు తర్వాత బీఆర్ఎస్ తీసుకోబోయే నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కానున్నాయి.

ఢిల్లీకి బీఆర్‌ఎస్‌ పార్టీ త్రిసభ్య బృందం - Tholi Paluku