

మెగాస్టార్ చిరంజీవితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు భేటీ
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సోమవారం టాలీవుడ్ మెగాస్టార్, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చిరంజీవిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో 'వికాస్, విశ్వాస్, జన కళ్యాణ్' తో కూడిన 12 సంవత్సరాల విజయవంతమైన పాలన పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘విశేష్ జన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా గత 12 ఏళ్లలో మోడీ ప్రభుత్వం సాధించిన కీలక విజయాలు, మైలురాళ్లను వివరించే ప్రత్యేక బుక్‌లెట్‌ను చిరంజీవికి రామచందర్ రావు అందజేశారు. ఈ సమావేశంలో వారిద్దరూ సినిమాలు, సమాజ, దేశ నిర్మాణంలో సినీ రంగానికి ఉన్న ప్రాధాన్యత గురించి ఎంతో స్ఫూర్తిదాయకమైన చర్చ జరిపారు. ప్రధాని మోడీ సేవా కాలం భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని రామచందర్ రావు పేర్కొన్నారు. మోడీ 12 ఏళ్ల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన ఇటీవల వరుసగా సినీ, బిజినెస్ ప్రముఖులతో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే.
