
బీజేపీలో చేరిన వైసీపీ సీనియర్ నేత చొక్కాకుల
భారతీయ జనతా పార్టీ సారథ్యం కార్యక్రమంలో భాగంగా గురువారం అనకాపల్లి జిల్లా పెంటకోట కన్వెన్షన్ లో జరిగిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ సమక్షంలో వికె పిసిపిఐఆర్ యుడిఎ మాజీ చైర్ పర్సన్,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చొక్కాకుల వెంకటరావు బీజేపీ లో చేరారు.
సబ్బవరం మాజీ వైస్-ఎంపీపీ ప్రస్తుత అంతకాపల్లి ఎంపీటీసీ చొక్కాకుల గోవింద తదితరులతో భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనకు ఆకర్షితుడినై పార్టీలో చేరుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాల్, రాష్ట్ర కార్యదర్శులు కేతిరెడ్డి సురేంద్రమోహన్, రెడ్డి పావని, జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, ఎలమంచిలి మున్సిపల్ చైర్ పర్సన్ పీలా రమాకుమారి, రాష్ట్ర నాయకులు ఈర్లె శ్రీరామ్మూర్తి, సీనియర్ నాయకులు బొడ్డేటి కాశీవిశ్వనాథ్, పొన్నగంటి అప్పారావు, ముమ్మన దేముడు, జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లె రామానాయుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
