Let's talk: editor@tmv.in
సినీ రంగంలో ‘పుప్పాల’ సేవలు మరువలేం!

సినీ రంగంలో ‘పుప్పాల’ సేవలు మరువలేం!

Praveen Batti
12 సెప్టెంబర్, 2025

మాజీ ముఖ్యమంత్రి నందమూరి కి తారక రామారావు తో కలిసి నాలుగు సినిమాల్లో నటించి సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న పుప్పాల వెంకటేశ్వరావు మరణం మచిలీపట్నానికి తీరని లోటని రాష్ట్ర టిడిపి నాయకులు కొనకల్ల పుల్లయ్య అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు పుప్పాల ప్రసాద్ తండ్రి సినీ నటులు పుప్పాల వెంకటేశ్వరరావు సంతాప సభ గురువారం వర్గ గుడిలో జరిగింది.

ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ తన 87 సంవత్సరాల జీవిత కాలంలో నీతి నిజాయితీతో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఎందరికో సహాయం అందించిన పుప్పాల మరణం తీరనిలోటని అన్నారు. మచిలీపట్నం మార్కెట్ యాడ్ చైర్మన్ కుంతే నాని మాట్లాడుతూ, “నేటి తరానికి పుప్పాల వెంకటేశ్వర్లు జీవితం మార్గదర్శకం” అని అన్నారు. పదిమందికి ఆదర్శప్రాయంగా తన జీవితాన్ని అందించారని అన్నారు.

మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ బాల వెంకటేశ్వరరావు మచిలీపట్నం పోర్టు ఉద్యమంలో తన సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సాయిన సుశీలరావు, మాజీ రుస్తుంబాద స్కూల్ ప్రధానోపాధ్యాయులు పైడిపాటి రాందేవ్, జనసేన పార్టీ ఇన్చార్జి కొండా మేస్త్రి, పలు రాజకీయ పార్టీ నాయకులు న్యాయవాదులు పాల్గొన్నారు.

సినీ రంగంలో ‘పుప్పాల’ సేవలు మరువలేం! - Tholi Paluku