
జగన్ బెదిరింపులకు ఎవరూ భయపడరు
పీపీపీ మోడల్ ద్వారా కూటమి ప్రభుత్వం నిర్మించతలపెట్టిన 10 మెడికల్ కాలేజీల టెండర్లలో పాల్గొనొద్దంటూ జగన్ హెచ్చరికలు చేయడం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీ బెదిరింపులకు రాష్ట్రంలో భయపడే వారెవరూ లేరు... బావిలో ఎవరి పడి చావాలో ఇప్పటికే ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పారు’ అంటూ జగన్ ను మంత్రి సవిత ఎద్దేవా చేశారు. తన నీలి మీడియాలో 17 మెడికల్ కాలేజీ నిర్మించానని ఆహా... ఓహో.. అని జగన్ రాయించుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని దెప్పి పొడిచారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ విజయోజత్సవ సభ మెగా హిట్ అయ్యిందని, ఇది చూసి ఓర్వలేక జగన్ విషం కక్కుతున్నాడని విమర్శించారు. పెనుకొండలో పునాదుల దశలోనే నిలిచిపోయిన మెడికల్ కాలేజీని కూటమి నాయకులతో కలిసి మంత్రి సవిత గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. 2021 లో 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నానంటూ ఆనాడు జగన్ రెడ్డి ఆర్భాటంగా గాల్లో వచ్చి శంకుస్థాపన చేశారన్నారు. రెండేళ్లలో పూర్తి చేస్తామని డబ్బా కొట్టారన్నారు. ఆయన పదవీ కాలం పూర్తయినా ఏ ఒక్క మెడికల్ కాలేజీని కూడా పూర్తిస్థాయిలో నిర్మించలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, నాబార్డు నిధులతో మాత్రమే విజయనగరం, నంద్యాల, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం మెడికల్ కాలేజీలను అసంపూర్తి నిర్మించి, ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభించేశాడని మండిపడ్డారు. పార్వతీపురం మెడికల్ కాలేజీ నిర్మాణానికి కనీసం టెండర్ కూడా పిలవలేదన్నారు. మెడికల్ కాలేజీలు మాత్రమే కాకుండా బీసీ భవనాలు, బీసీ హస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లు, ఇతర భవనాలను సైతం నిధులున్నా కూడా పూర్తి చేయలేదన్నారు. టీడీపీకి మంచి పేరు వస్తుందనే అసూయతో ఆ భవనాలను పట్టించుకోలేదన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చడం జగన్ కు తెలుసని, భవన నిర్మాణాలు మాత్రం చేతకాదని మంత్రి సవిత ఎద్దేవా చేశారు.
గతంలోనూ జగన్ అవాకులు చవాకులు
ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ ద్వారా నిర్మించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారని మంత్రి సవిత వెల్లడించారు. ఈ నిర్ణయంపై జగన్ విషం కక్కుతున్నారని ఆమె మండిపడ్డారు. ప్రజారోగ్యం మెరుగుపడడం జగన్ కు ఇష్టంలేదన్నారు. అందుకే, మెడికల్ కాలేజీల నిర్మాణానికి టెండర్లు వేస్తే, తమ ప్రభుత్వం వస్తే రద్దు చేస్తానని హెచ్చరికలు దిగుతున్నాడని అన్నారు. పోలీసులను, ఉద్యోగులను బెదిరించడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. జగన్ బెదిరింపులకు రాష్ట్రంలో భయపడేవారేవరూ లేరన్నారు. కియా పరిశ్రమ నిర్మాణం సమయంలోనూ జగన్ ఇటువంటి అవాకులు చవాకులు పేలాడని అన్నారు. కియా పరిశ్రమకు ఇచ్చిన భూములు తిరిగి ఇప్పించేస్తానని ఆనాడు చెప్పాడన్నారు. కియా, దాని అనుబంధ పరిశ్రమల వల్ల లక్షలాది మందికి ఉపాధి లభ్యమవుతోందన్నారు. జీఎస్టీ, పన్నుల రూపంలో రాష్ట్రానికి ఆదాయం వస్తోందన్నారు. కియా పరిశ్రమ వల్ల జగన్, ఆయన బ్యాచ్ ఎక్కువగా లబ్ధిపొందింది అని అన్నారు.
బావిలో పడి ఎవరు చావాలో ప్రజలు అల్రెడీ తీర్పిచ్చారు.
సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ ను, మంత్రి అచ్చెన్నాయుడునే బావిలో పడి చావాలని జగన్ అనడంపై మంత్రి సవిత తీవ్రంగా స్పందించారు. ఇదేనా ఎమ్మెల్యేగా మాట్లాడే తీరు అంటూ మండిపడ్డారు. బావిలో ఎవరి పడి చావాలో గత సాధారణ ఎన్నికల్లోనూ, ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే స్పష్టమైన తీర్పు చెప్పారని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి జగన్ కు మాట్లాడే అర్హత లేదని మంత్రి సవిత స్పష్టంచేశారు
ఇదేనా ఆహా... ఓహో అంటే..?
అంతకుముందు కూటమి నాయకులతో కలిసి పెనుకొండలోని పునాదుల దశలోనే నిలిచిపోయిన మెడికల్ కాలేజీని మంత్రి సవిత పరిశీలించారు. అక్కడికి వచ్చిన మీడియా కూడా మెడికల్ కాలేజీ దుస్థితిని చూపించారు. తన సొంత నీలి మీడియాలో మెడికల్ కాలేజీలను నిర్మించానంటూ కథనాలు రాయించుకోవడంపై జగన్ ను విమర్శించారు. ఇదేనా ఆహా... ఓహో....? అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబునాయుడు 27 మెడికల్ కాలేజీలు నిర్మించారన్నారు. టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలను నిర్మించి తీరుతామని మంత్రి సవిత స్పష్టంచేశారు.
‘సూపర్ సిక్స్- సూపర్ హిట్’ మెగా హిట్
అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన సూపర్ సిక్స్- సూపర్ హిట్ విజయోత్సవ సభ మెగా హిటయ్యిందని మంత్రి సవిత ఆనందం వ్యక్తంచేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి భారీ సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలొచ్చారన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంద, ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేశామని వెల్లడించారు. సంక్షేమంతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి కూడా పరుగులు తీస్తోందన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సీసీ, బీటీ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విదేశీయులను నియమించుకుంటున్న రష్యా
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 2022లో ప్రారంభమైంది. ఈ యుద్ధంలో రష్యా తన సైన్యాన్ని బలోపేతం చేసుకోవడానికి విదేశీయులను నియమిస్తోంది. భారతీయులు కూడా ఇందులో చిక్కుకున్నారు. గత రెండేండ్లలో 126 మంది భారతీయులు రష్యా సైన్యంలో చేరినట్లు భారత ప్రభుత్వం ధ్రువీకరించింది. వీరిలో కనీసం 12 మంది మరణించారు. 16 మంది అదృశ్యమయ్యారు. తాజాగా, డోనెట్స్క్ ప్రాంతంలో ఇద్దరు భారతీయులు నిర్మాణ పనుల సాకుతో రష్యాకు వెళ్లి, యుద్ధంలో చేరినట్టు సమాచారం.
వీరు స్టూడెంట్ లేదా విజిటర్ వీసాలపై రష్యా వెళ్లినట్టు సమాచారం. భారత ప్రభుత్వం ఈ అంశంపై రష్యా అధికారులతో చర్చలు జరుపుతోంది. రష్యా సైన్యంతో పనిచేయడం ప్రమాదకరమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. గత సంవత్సరం ప్రధాని మోదీ రష్యా పర్యటనలో పుతిన్తో ఈ విషయం చర్చించారన్నారు. ఫలితంగా కొంతమంది భారతీయులు విడుదలయ్యారని తెలిపారు.
భారతీయులు ఎందుకు మోసపోతున్నారు?
భారతీయులు రష్యా సైన్యంలో చేరడానికి ప్రధాన కారణం నిరుద్యోగం, ఏజెంట్ల మోసం. చాలామంది యువకులు ఉద్యోగాల కోసం రష్యాకు వెళ్తున్నారు. వారిని 'సపోర్ట్ స్టాఫ్' లేదా 'కన్స్ట్రక్షన్ వర్కర్' పేరుతో మోసం చేసి, సైనిక శిక్షణ ఇచ్చి యుద్ధభూమికి పంపుతున్నారు. ఉదాహరణకు, హర్యానా
