Let's talk: editor@tmv.in
అన్భుమణి ఓ కలుపు మొక్క

అన్భుమణి ఓ కలుపు మొక్క

Pinjari Chand
12 సెప్టెంబర్, 2025

పీఎంకే నుంచి అన్భుమణిని తొలగించినట్లు సీనియర్ నాయకుడు, పత్తలి మక్కల్ కచ్చి వ్యవస్థాపకుడు రాందాస్ ప్రకటించారు. ఇక నుంచి పార్టీలో ఆయనకు ఎటువంటి స్థానం లేదని, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగించినట్లు వివరించారు. తన కుమారుడే అయినప్పటికీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. తైలపురం లో గురువారం పార్టీలోని ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్బుమణిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కుమారుడైన అన్బుమణిని కలుపు మొక్కతో పొల్చారు.

గతంలో అన్బుమణి పార్టీ పై పట్టు సాధించాలని ప్రయత్నించారు. తనే సొంత నిర్ణయాలు తీసుకుని తనకు కావాల్సిన వారిని పార్టీలో ముఖ్య పదవుల్లో నియమించారు. దీంతో పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే కుటుంబ వ్యవహరాల్లో కూడా ఆయన ప్రవర్తన సరిగా లేదని, తండ్రిపైనే రహస్య వేగులను నియమించారని ఆరోపించారు. అలాగే ఆయన పై ఉన్న పలు ఆరోపణలపై వివరణ ఇవ్వడంలో విఫలమైనందునే పార్టీ నుంచి వెలివేశామని తేల్చి చెప్పారు. వ్యక్తిగతంగా కానీ, లిఖిత పూర్వకంగా కానీ సమాధానం ఇవ్వలేదని వివరించారు.

అన్భుమణి ఓ కలుపు మొక్క - Tholi Paluku