
ఎయిర్ ఇండియాలో ఉక్కపోత
ఎయిరిండియా విమానాలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. సాంకేతిక కారణాలతో ఆగిపోవడం, సరిగా పనిచేయకపోవడం, పక్షులు ఢీ కొట్టడం, సిబ్బంది సరిగా వ్యవహరించకపోవడం, ఇలా అనేక కారణాలతో హెడ్ లైన్స్ కు ఎక్కుతూనే ఉంది. తాజాగా గురువారం ఢిల్లీ నుంచి నేపాల్ వెలుతున్న విమానంలో ఏసీలు పనిచేయక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఉక్కపోతను భరించలేక విమానం నుంచి దిగిపోయారు. దీంతో ప్రయాణికులు లేక అధికారులు విమానాన్ని విమానాశ్రయంలోనే నిలిపివేశారు. సాంకేతిక లోపం కారణంతోనే ఈ విధంగా జరగినట్లు వెల్లడించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని వివరించారు.
బుధవారం రాత్రి 11 గంటల సమయంలో సింగపూర్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో కూడా ఇదే పరిస్థితులు తలెత్తాయి. ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పేపర్లు, బట్టలు, తదితర వాటితో గాలిని తీసుకున్నారు. ఉక్కపోతకు భరింలేక నరకయాతన అనుభవించారు. పిల్లలయితే ఏడ్చేశారు. సాంకేతిక కారణాలతో విమానాన్ని నిలిపేశారు. రెండు, మూడు గంటలైనా విమానం బయల్దేరక పోవడంతో దాదాపు 200 మంది ప్రయాణికులను టెర్మినల్ బిల్డింగ్ల్లోకి తరలించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
