
ఆర్జేడీ నేత దారుణ హత్య
త్వరలో బీహర్ లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో బుధవారం రాత్రి జరిగిన హత్య ఒక్కసారిగా రాష్ర్టంలో, రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఆర్జేడీకి చెందిన ముఖ్యనేత, తేజస్వీ యాదవ్ పోటీచేసే రాఘోపూర్ నియోజకవర్గం నాయకుడి హత్యతో ఆర్జేడీ కూడా ఉలిక్కిపడింది. ఓ రాజకీయ నేతను చంపడం తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. రాజ్ కుమార్ అలియాస్, అల్లారాయ్ ని దుండగులు కాల్చిచంపారు.
ఆర్జేడీ పంచాయతీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా
రాజ్ కుమార్ రాయ్ వైశాలీ జిల్లాకు చెందిన వాడు. ఆ ప్రాంతంలో రాజకీయాల్లో చాలా చురుకుగా ఉంటాడు. ముఖ్యంగా ఆర్జేడీ అంటే చాలా అభిమానం రానున్న ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో రాఘోపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే చిత్రగుప్త్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మున్నాచక్ ప్రాంతంలో ఆయన పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి, అక్కడి నుంచి బైక్ పై పారిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని రాజ్ కుమార్ రాయ్ ని ఆసుపత్రి కి తరలించారు.
అయితే అప్పటికే ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు. అయితే భూ వివాదంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చుననే ఎస్పీ పరిచయ్ కుమార్ భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ టీం హత్య జరిగిన ప్రదేశంలో ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకుంది. దగ్గరలోని సీసీటీవీ ఫుటేజ్ లో దుండగులు పారిపోతున్న దృశ్యాలు కనిపించాయని అన్నారు. అలాగే రాయ్ డ్రైవర్ను, ఇతర సాక్షులను విచారిస్తున్నామని, ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ హత్యతో పోలీసులు రాష్ట్రంలో మరింత భద్రత పెంచే అవకాశాలు ఉన్నాయి.
