.jpeg)
బీసి కులాలకు ఉనికిని తీసుకొచ్చిందే జగన్: సజ్జల
గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల పార్టీ కేడర్కు దిశానిర్ధేశం చేశారు. ఆయన ఏమన్నారంటే.. బీసీ కులాలకు ఒక ఉనికిని తీసుకొచ్చింది వైయస్ జగన్ ప్రభుత్వమే, బీసీ కులాలకు గుర్తింపును, సమాజంలో చైతన్యంను తీసుకొచ్చి వైభవం తీసుకొచ్చి పెద్దపీట వేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. వెనుకబడిన కులాలకు ఒక సమగ్ర విధానం తీసుకొచ్చి అందరికీ అభివృద్ది ఫలాలు అందాలని జగన్ గారి హయాంలో మేలు చేశారు. ప్రతిపక్షం అనేది మనకు ఒక మంచి అవకాశం, వెనకబడిన కులాలు అందరినీ చైతన్యపరిచి, జగన్ గారి వల్ల మనకు భవిష్యత్ ఉంటుందనే చైతన్యం అందరిలో తీసుకురావాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని కోరారు.
ఇక ఏ మాత్రం జాప్యం తగదు. జగన్ గారి ఆలోచనలు, విధానాలను మీమీ బీసీ కులాల్లోకి మరింతగా తీసుకెళ్ళాలి. పార్టీ కేంద్ర కార్యాలయం సమన్వయంతో ముందుకు వెళ్ళి అందరూ సమిష్టిగా పనిచేయాలి. ఐదేళ్ళలో మనం ప్రజలకు చేసిన మంచి ఎక్కడికీ పోలేదు, అందరికీ అర్ధమవుతోంది. కూటమి ప్రభుత్వంపై ప్రజలు విసిగెత్తిపోయారు, టీడీపీ ఫేక్ ప్రచారంతో అబద్దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. దానిని మనం ధీటుగా ఎదుర్కోవాలి, వాస్తవాలను ప్రజల ముందుంచాలి, సోషల్ మీడియాలో మనం ఉత్సాహంగా ముందుకెళ్ళి మన వాణిని బలంగా వినిపిద్దాం. బీసీ కులాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ వెంటే ఉన్నాయని నిరూపిద్దామని పేర్కొన్నారు
వైఎస్సార్సీపీ బీసీ సెల్ స్టేట్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ రాచగొల్ల రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని జగన్ గారు బీసీలకు రాజకీయంగా సముచిత స్ధానం కల్పించారు. జగన్ గారిని మళ్ళీ సీఎం చేసుకునేందుకు మన బీసీ కులాలంతా ఏకం కావాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వెనకబడిన కులాలకు జరిగిన మేలు ఎవ్వరూ మరిచిపోరు. కూటమి ప్రభుత్వం బీసీలను వంచిస్తుంది, అబద్దపు హామీలు, మాయమాటలతో కూటమి ప్రభుత్వం మన బీసీలను నిలువునా ముంచింది. నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వ తీరును మనం ప్రజల్లో ఎండగడదామని కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు.
వైఎస్సార్సీపీ బీసీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ మాట్లాడుతూ..బీసీలకు జగన్ గారు చేసిన మేలు ఎవరూ మరిచిపోరు, మనమంతా జగన్ గారిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలి. నాడు దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు బీసీలకు చేసిన మేలు ఆ తర్వాత జగన్ గారు మాత్రమే మన బీసీ కులాలకు న్యాయం చేసి మనల్ని గుర్తించారు. బీసీలంతా ఐక్యంగా మనకు అప్పజెప్పిన బాధ్యతలు నిర్వర్తించి మనం ఐకమత్యంగా జగనన్నను మరోసారి సీఎం చేసుకుందాం. కూటమి ప్రభుత్వం బీసీలకు చేస్తున్న మోసం, ద్రోహాన్ని మనం ఎండగట్టాలి. ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలు పూర్తిగా తుంగలో తొక్కి మన బీసీ కులాలకు తీరని అన్యాయం చేస్తుంది.
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అంకంరెడ్డి నాగనారాయణ మూర్తి దేశంలో ఏ సీఎం ఇవ్వని విధంగా జగన్ గారు బీసీకులాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించి సముచిత స్ధానం కల్పించారు. బీసీల్లోని అన్ని కులాలకు ప్రభుత్వంలో పదవులు ఇవ్వడమే కాకుండా సంక్షేమ పధకాలలో కూడా సింహభాగం బీసీలకు కేటాయించి చరిత్ర సృష్టించారు. బీసీ కులాలంతా జగన్ గారిని మళ్ళీ సీఎం చేసుకుని ఆయన రుణాన్ని తీర్చుకోవాలని తహతహలాడుతున్నారు. వైఎస్సార్సీపీ అన్ని విభాగాల్లోని కమిటీలలో కూడా బీసీలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ బీసీలపై చూపుతున్న ప్రేమ ఎప్పటికీ మరిచిపోలేం. బీసీలంతా సంఘతితమై జగన్ గారు ఇచ్చిన ప్రతి బాధ్యతను అకుంఠిత దీక్షతో రేయింబవళ్ళు కష్టపడి పార్టీని బలోపేతం చేసుకుంటూ బీసీలకు ద్రోహం చేస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించవరకూ విశ్రమించద్దని అన్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి (ఎమ్మెల్సీ), ఆలూరు సాంబశివారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అంకంరెడ్డి నాగనారాయణ మూర్తి, 48 బీసీ కులాల సాధికార అధ్యక్షులు, పలువురు వైసీపి నాయకులు పాల్గొన్నారు
