Let's talk: editor@tmv.in
ధరలు తగ్గించిన హిందూస్తాన్ యూనిలివర్

ధరలు తగ్గించిన హిందూస్తాన్ యూనిలివర్

FL - BRTH
14 సెప్టెంబర్, 2025

ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనికీ సంబంధించిన కీలక కన్జ్యూమర్ ప్రాడక్ట్స్ ధర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. డవ్ షాంపూ, హార్లిక్స్, కిసాన్ జామ్, లైఫ్ బాయ్ షాంపూ ధరలు తగ్గిస్తున్నట్టు పేర్కొంది. తగ్గిన ధరలు సెప్టంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. 340 ఎంఎల్ డవ్ షాంపూ బాటిల్ గతంలో రూ.490 ఉండేది. ఇప్పుడు ఆ బాటిల్ ను రూ.435కే బహిరంగ మార్కెట్లో అమ్ముతారు. 200 గ్రాముల హార్లిక్స్ జార్ ధర గతంలో రూ.130 ఉంటే.. ఇప్పుడది రూ.110కే అందుబాటులోకి వస్తుంది. గతంలో 200 గ్రాముల కిసాన్ జామ్ బాటిల్ రూ.90కి అమ్మేవారు. ఇప్పుడది రిటైల్ గా రూ.80కే అందుబాటులోకి వస్తుంది. 75 గ్రాముల లైఫ్ బాయ్ సోప్ ప్యాక్ గతంలో రూ.68కి అమ్మేవారు. ఇప్పుడది రూ.60కే మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది.

కంపెనీలు ధరలు తగ్గించిన తర్వాత వాటిని అధికారికంగా ప్రకటించాలని గతంలో ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీ తమ ధరల తగ్గింపు సమాచారాన్ని పత్రికల ద్వార తెలిపింది. హిందూస్థాన్ యూనిలివర్ కంపెనీ తమ కీలక ప్రాడక్టుల ధర తగ్గింపునకు .. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ రేట్ల మార్పే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 18 శాతం,12 శాతం ఉన్న ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం 5 శాతానికి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో కంపెనీలు ధరలు తగ్గించాయి. ఫలితంగా ఎఫ్ఎంసీజీ వస్తువుల డిమాండ్ పెరుగుతుందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్ఎంసీజీ కంపెనీలు మాత్రమే కాకుండా జీఎస్టీ రేట్లు తగ్గిన కంపెనీలన్నీ తమ ప్రాడక్టుల ధరలను జీఎస్టీ రేట్ల మార్పుకు తగ్గట్టు తగ్గిస్తున్నాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ ను పెంచే దిశగా కృషి చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ధరలు తగ్గించిన హిందూస్తాన్ యూనిలివర్ - Tholi Paluku