
ఆసియాకప్‌ను బహిష్కరిద్ధాం!
ఆసియా కప్ లో భాగంగా ఆదివారం ఇండియా, పాకిస్ఠాన్ మధ్య రసవత్తరమైన పోరు జరగనుంది. అయితే పహెల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్ ను రద్దు చేయాలని, వారితో ఆడకూడదని పెద్ద ఎత్తున అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆసియాకప్–2025 బాయ్ కాట్ ట్రెండింగ్ నడుస్తోంది. అయితే ఈ మ్యాచ్ షెడ్యూల్ జూలైలోనే ఖరారైందని బీసీసీఐ పేర్కోంది. అయితే అంతర్జాతీయ సీరిస్ ల్లో తప్పా, ద్వైపాక్షిక సీరిస్ లో ఇండియా ఆడదని వివరించారు. అయినా ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీంతో బీసీసీఐ పెద్దలు ఆదివారం జరిగే మ్యాచ్ కు ఎవరూ వెళ్లకపోవచ్చుననే సందేహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎవరూ దుబాయ్ చేరుకోలేదని తెలుస్తోంది.
ట్విట్టర్ ట్రెండింగ్ లో
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మేం మనుషులతో ఆడుతాం.. ఉగ్రవాదులతో కాదు అని ఒకరు. మేం పహల్గాం ఉగ్రదాడిని మరిచిపోం.. మేం ఎప్పటికీ మిమ్మల్ని క్షమించాం అని మరోకరు. రాజకీయ నాయకులకు రాజకీయం తప్పా... దేశ క్షేమం పట్టదు. దాడి తరువాత ప్రగల్భాలు పలికి ఇప్పడు సైలెంట్ గా మ్యాచ్ ను సెట్ చేశారని ఇంకోకరు పహల్గాం ఉగ్రదాడి ఫోటోను షేర్ చేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ మీరు పాకిస్టాన్ క్రీడాకారులతో కరచాలనం చేయవద్దని ఇండియా ఆటగాళ్లను కోరుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తరువాత జరిగే మ్యాచ్ కానుండడంతో ఇప్పటికే హైప్ ఏర్పడింది. ఈ ట్రెండింగ్ తో మరింత హైప్ వచ్చింది.
సంచలన వ్యాఖ్యలు చేసిన బాధితురాలు
ఆసియా కప్ లో భారత్ - పాక్ జట్ల మధ్య మ్యాచ్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. అయితే ఈ మ్యాచ్ పై పహల్గాం ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన బాధితురాలు ఐషాన్య ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా మ్యాచ్ ఆడటానికి ఓకే చెప్పారు. ఇది ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలను అవమానించడమే. ప్రాణాలు కోల్పోయిన ఆ 26 కుటుంబాల పట్ల మీకు ఎటువంటి జాలి లేదా? మేం ఎప్పటికీ వారితో ఆడటాన్ని ఒప్పుకోం.మ్యాచ్ ఆడాలనే నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. మీరు ఎవరూ మ్యాచ్ చూడటానికి వెళ్లకండి, టీవీల్లో కూడా చూడొద్దు అని దేశ ప్రజలను కోరారు. క్రికెటర్లను మీకు దేశభక్తి లేదా అని అడిగారు. బీసీసీఐ ని దేశంలో నుంచి నిషేదించాలని కోరారు. ఈ మ్యాచ్ పై దేశవ్యాప్తంగా ప్రభుత్వంపై , బీసీసీఐ పై వ్యతిరేకత మొదలైంది.
