
ట్రెండింగ్లో..
సోషల్ మీడియాలో ఒక్కో సమయంలో ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. మొన్నటి దాకా గిబ్లీ ఇమేజ్ ట్రేండింగ్ ఉండేది. ఒకరి తర్వాత ఒకరు మేం ఇలా ఉంటాం అంటూ ఫన్నీ యానిమేషన్ ఎన్నో స్టేటస్ లు పెట్టారు. సోషల్ మీడియా లో లెక్క లేనన్ని పోస్ట్లు. ఇప్పుడేమో మళ్లీ మరో కొత్త అప్డేట్ వచ్చేసింది. అదేంటి అంటే బననా ఏఐ ఇమేజ్ ట్రెండ్. వాట్సాప్ స్టేటస్లు, ఫేస్బుక్ పోస్టులు, ఇన్స్టాగ్రామ్ ఒక్కటేమిటి అన్ని చోట్ల ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నారు. నానో బనానా ఫొటోలు అసలు ఏంటి ఇది అంటే ?
సాధారణ ఫోటోల బదులు చిన్న 3డి విగ్రహాల్లా కనిపించే ఈ క్రియేషన్స్, చిన్నగా ఎవరికైనా ఇట్టే నచ్చేసేంత ముద్దుగా ఉంది అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఒక వైపు సినీ అభిమానులు, మరో వైపు క్రికెట్ ఫ్యాన్స్, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఇలా అందరి మినీ స్టాచు లను నానో బనానా స్టైల్లో షేర్ చేస్తుంటే మురిసిపోయి అభిమానులు నెట్టింట్లో పోస్ట్ చేస్తున్నారు. అసలు ఈ ఇమేజ్లు తయారయ్యే వెనక టెక్నాలజీ ఏమిటంటే? గూగుల్ జెమినీకి చెందిన జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ టూల్. ముందుగా జెమినీ అకౌంట్లో లాగిన్ అయ్యి, ఒక ఫొటోని అప్లోడ్ చేస్తే చాలు, అది కొద్ది సెకన్లలోనే రియలిస్టిక్ 3డి మోడల్గా మారిపోతుంది. అయితే ఏఐ ఎప్పటికప్పుడు ప్రమాదంగా మారుతున్నప్పటికీ కూడా, జనాల్లో ఈ కొత్త ట్రెండ్ హవా మాత్రం తగ్గట్లేదు. మారుతున్నా టెక్నాలజీతో పాటు మనము మారడం అవసరమే అయినప్పటికీ జాగ్రత్త మాత్రం తప్పదు.
మీరు నానో బనానా 3డి ఇమేజ్ రెడీ చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఈ ఫిగరిన్ క్రియేట్ చేయడం కోసం ప్రత్యేకమైన టెక్నికల్ నైపుణ్యం అవసరం లేదు. గూగుల్ జెమినీ యాప్ లేదా వెబ్సైట్లో లాగిన్ అయి, మీకు నచ్చిన ఫోటోను అప్లోడ్ చేసి, క్లియర్గా ప్రాంప్ట్ ఇస్తే చాలు. మీరు కోరుకునే బ్యాక్గ్రౌండ్, ఎమోషన్, స్టైల్ వంటి వివరాలు కూడా ప్రాంప్ట్లో జోడిస్తే, అవుట్పుట్ మరింత రియలిస్టిక్గా వస్తుంది. ముఖ్యంగా, ఈ ట్రెండ్కి మరో ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి ఖర్చు లేకుండా ఫ్రీ గా తయారు చేసుకోవచ్చు. అదనంగా, ఈ ఫోటోలను చిన్న వీడియోలుగా కూడా మార్చుకునే ఆప్షన్ అందుబాటులో ఉంది. అందుకే నానో బనానా 3డి ఫిగరిన్లు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా సూపర్ వైరల్ అవుతున్నాయి.
ఫస్ట్ స్టెప్లో జెమిని యాప్ లేదా వెబ్సైట్ సహాయం తీసుకోవాలి. ఇతర యాప్లు కూడా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే కేవలం కొన్ని సూచనలు(ప్రాంప్టులు) ఇస్తే చాలు, ఏఐమీ కోసం మ్యాజిక్ చేస్తుంది. సరైన ఏఐటూల్ ఎంచుకోండి. మీ ఊహకు తగ్గట్టుగా ప్రాంప్ట్ను రూపొందించుకోవాలి. ఈ ప్రాంప్ట్లలో మీ గురించి లేదా మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న వ్యక్తి గురించి, బొమ్మ ఎలా ఉండాలి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఎమోషన్స్ ఎలా ఉండాలి వంటి వివరాలు స్పష్టంగా చెప్పాలి. అంతేకాకుండా అక్కడ మీ రియల్ ఫోటోలను అటాచ్ చేసి వాటిని నచ్చిన స్టైల్లో మార్చుకోవచ్చు.
ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా హంగామా చేస్తున్న ట్రెండ్ నానో బనానా ఫిగ్యూరిన్. పేరు కొంచెం వింతగా అనిపించినా, చూసిన వెంటనే ఆశ్చర్యపరిచేలా ఉండే ఈ బొమ్మలు సాధారణ ఫిగ్యూరిన్లు కావు. ఇవి గూగుల్ జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ టూల్ సహాయంతో రూపొందించిన హైపర్ రియలిస్టిక్ 3డి మోడల్స్. యూజర్ ఇచ్చే చిన్న సూచనలు (ప్రాంప్ట్లు) ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అద్భుతమైన, సూక్ష్మమైన వివరాలతో కూడిన ఈ ఫిగ్యూరిన్లను సృష్టిస్తుంది. ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా, ఖర్చు లేకుండా సులభంగా క్రియేట్ చేసుకోవచ్చన్న కారణంగానే ఈ ట్రెండ్ ఇప్పుడు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరినీ ఆకట్టుకుంటోంది.
అవగాహన అవసరం: ప్రస్తుతం సోషల్ మీడియాలో జెమిని 3డీ ప్రింట్ ట్రెండ్ విపరీతంగా దూసుకుపోతోంది. కానీ మీ అంతట మీరే మీ వ్యక్తిగత డేటా ను పర్సనల్ నుండి పబ్లిక్ చేసేస్తున్నారని మర్చిపోవద్దు. ఎవరి వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా 3డీ ఫిగ్యూరిన్ ఇమేజ్లు కనిపిస్తున్నాయి, అందరి లాగే మనము చేస్తే తప్పేముంది అనుకుంటే పొరపాటే! ఈ ట్రెండ్ వెనుక పెద్ద సైబర్ ముప్పు దాగి ఉందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు. మీరు అప్లోడ్ చేసిన ఫోటోలు ఎవరి చేతికి చిక్కుతాయో తెలీదు, ఎప్పుడు ఏ నేరగాడు మీ అకౌంట్ ఖాళీ చేస్తాడో తెలీదు.
అప్రమత్తంగా ఉండటం అవసరం. ముఖ్యంగా మహిళలు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ, అప్లోడ్ చేసిన ఫోటోలు సైబర్ నేరగాళ్లకు లభిస్తే అవి మార్ఫింగ్, అశ్లీల కంటెంట్ తయారీకి ఉపయోగపడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా డుప్లికేట్ ఐడెంటిటీలతో ఫైనాన్షియల్ మోసాలు చేసే అవకాశం కూడా ఉందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రెండు రోజుల్లోనే కోట్ల సంఖ్యలో ఫోటోలు జెమిని యాప్ ద్వారా అప్లోడ్ అయ్యాయని అధికారులు గుర్తించారు. వీలైనంత వరుకు మీ సోషల్ మీడియా అకౌంట్స్ కు వాడే పేరు, ఫోటో, ఇతర విషయాలు ఏ మొబైల్ ఫోన్ లో ఐతే ఉన్నాయో, అందులో మీ పెమెంట్స్ కి సంబంధించిన యాప్స్ వాటి డేటా ఉండకుండా చూసుకోవడం అవసరం. ఎందుకంటే ప్రతి యాప్ లేదా ఏ కొత్త వెబ్సైటు లోకి లాగిన్ అయినా అది మీ డేటా యాక్సెస్ కలిగి ఉంటుందని ఆలోచన మాత్రం మర్చిపోవద్దు.
