Let's talk: editor@tmv.in
కూకట్పల్లి రేణు హత్య కేసులో నిందితుల అరెస్ట్

కూకట్పల్లి రేణు హత్య కేసులో నిందితుల అరెస్ట్

Panthagani Anusha
14 సెప్టెంబర్, 2025

కూకట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో 50 ఏళ్ల రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. హత్య జరిగిన నాలుగు రోజుల్లోనే ఇద్దరు ప్రధాన నిందితులను రాంచీ, జార్ఖండ్లో గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసు ఛేదనలో ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఫలప్రదంగా నిలిచింది. హర్ష్ అనే నిందితుడు రాంచీకి బయల్దేరిన సమయంలో, డ్రైవర్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ చూసి, అక్కడ ఉన్న వ్యక్తులను తన క్యాబ్లో ఉన్న కస్టమర్లతో సరిపోల్చుకొని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం, హర్ష్, రోషన్ రేణును హత్యకు ప్రణాళిక చేశారు. అయితే హర్ష అనే వ్యక్తి రేణు ఇంట్లో పది రోజుల క్రితం పనిలో చేరి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. హర్ష యజమానులు వద్ద నమ్మకంగా ఉన్నటు నమ్మించి, హత్యకు పథకం సిద్ధం చేశాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాకేష్ అగర్వాల్ షాప్కు వెళ్లగా, రేణు ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించారు. ఇదే సరైన సమయంగా భావించిన హర్ష రేణుని హతమార్చాడు. రాకేష్ సాయంత్రం ఇంటికి వచ్చి తలుపులు లాక్ అయినట్టు గమనించి రేణుకు ఫోన్ చేసినప్పటికీ ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో, ప్లంబర్ సహాయంతో తలుపులు తెరిచారు. రాకేష్ తలుపులు తెరిచి చూసేసరికి రేణు విగతజీవిగా పడిఉంది.

పోలీసులు గుర్తించిన వివరాల ప్రకారం, నిందితులు రేణును కాళ్లు, చేతులు కట్టేసి, కుక్కర్తో ఆమె తలపై దాడి చేసి, కత్తితో 20 సార్లు పొడిచి హత్య చేశారు. హత్య సమయంలో ఆమె గొంతులో కత్తెర పెట్టి కేకలు వేయకుండా నిరోధించారు. హత్య అనంతరం నిందితులు 5 తులాల బంగారం, రూ.50,000 నగదు, ఖరీదైన వాచీలను దొంగిలించి పరారయ్యారు.

ఇక హఫీజ్పేట్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద స్కూటీ వదిలి, క్యాబ్లో విశాఖపట్నం మీదుగా రాంచీకి పారిపోయిన నిందితులను పోలీసులు ఐదు ప్రత్యేక బృందాల సహాయంతో ట్రాక్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్, స్కూటీ ట్రాక్, క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను ఓయో రూమ్లో గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారిని హైదరాబాద్కు తరలించారు. పోలీసులు ఇంకా హత్యలో ఇతర సహకారులను గుర్తించడానికి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసు సామాన్య ప్రజల సానుకూల సమాచారాన్ని ఉపయోగించి నేరాన్ని త్వరగా చేదించడంలో సిటిజన్ పోలీసింగ్ ప్రాముఖ్యతను చూపుతుంది.

కూకట్పల్లి రేణు హత్య కేసులో నిందితుల అరెస్ట్ - Tholi Paluku