Let's talk: editor@tmv.in
కోట్ల రూపాయల క్రిప్టో స్కామ్

కోట్ల రూపాయల క్రిప్టో స్కామ్

Panthagani Anusha
14 సెప్టెంబర్, 2025

ఇటీవల కాలంలో క్రిప్టో కరెన్సీ పెట్టుబడులపై ఆకర్షణ పెరుగుతోంది. అనేక కంపెనీలు, ఆన్లైన్ ప్లాట్ఫార్ములు పెద్ద లాభాలు వస్తాయని ప్రచారం చేస్తుండటంతో, సాధారణ పెట్టుబడిదారులు సహా అందరూ ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. కానీ వీటిలో చాలా వరకు మోసపూరిత స్కీమ్లుగానే మారుతున్నాయి. నిపుణుల హెచ్చరికలను పట్టించుకోకుండా పెట్టుబడులు పెట్టిన ఎందరో నష్టపోతున్నారు. అలాంటి ఉదంతమే కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

కరీంనగర్లో మాజీ కార్పొరేటర్ నేతృత్వంలోని గ్యాంగ్, ప్రజలతో కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్లు బయటపడింది. ‘మెటా ఫండ్ క్రిప్టో’ అనే పేరుతో మూడు నెలల్లో మూడింతలు లాభాలు వస్తాయని నమ్మించి నమ్మినవారి నుంచి కోట్లు వసూలు చేసి, చివరికి ఒక్క రూపాయి తిరిగి ఇవ్వలేదు.ఈ మోసంపై పలువురు పెట్టుబడిదారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు

సమాచారం ప్రకారం సెప్టెంబర్ 11న తీగలగుట్టపల్లికి చెందిన నున్సావ భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన ప్రకారం, కోతిరాంపూర్కు చెందిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ తనకు పరిచయం ఉన్న వ్యక్తి. అయితే సతీష్ “మెటా ఫండ్ క్రిప్టో”లో పెట్టుబడి పెడితే మూడు రెట్లు లాభాలు వస్తాయని నామించాడని . మొదట రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టిన భాస్కర్, సతీష్ సూచనలతో మరో 17 మందిని ఈ మెటా ఫండ్ క్రిప్టో లో పెట్టుబడులు పెట్టెల చేశానని తెలిపాడు . ఇలా మొత్తం రూ.1.20 కోట్లు వసూలు చేసినట్లు తేలింది.

అయితే అంటువంటి లాభాలు రాకపోవడంతో ప్రశ్నించిన బాధితుల్ని బెదిరించినట్టు పెట్టుబడిదారులు ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సతీష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. దర్యాప్తులో అతని వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఐపాడ్, బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు ప్రధాన నిందితుడు లోకేష్ సహా మరికొంతమంది ఈ మోసంలో భాగమై ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చీరలు చేపట్టారని వెల్లడించారు. ఆశ్చర్య కరమైన విషయం మంటుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక మంది పెట్టుబడిదారులు ఈ మోసానికి గురయ్యారని సమాచారం. వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని కానీ, చాలా మంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని అధికారులు తెలిపారు.

కోట్ల రూపాయల క్రిప్టో స్కామ్ - Tholi Paluku