Let's talk: editor@tmv.in
శ్మశానంలో ఇదేం పనులు?

శ్మశానంలో ఇదేం పనులు?

FL - SIMHCLM
14 సెప్టెంబర్, 2025

మనిషికామానికిహద్దుపద్దులేకుండాపోతోంది.అడవిలోను..గదిలోనూ..ఆఖరుకు స్మశానంలో కూడా కామక్రీడలు సాగిపోతున్నాయి. హైదరాబాదులోని బేగంపేటలోని స్మశాన వాటికలో ఉన్న గదిలో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్న మహిళను దాడి చేసి పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. బేగంపేట ధనియాలగుట్ట శ్మశానవాటికలోని గదిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మరో మహిళతో పాటు విటుడిగా వచ్చిన వ్యక్తికి నోటీసులు అందజేశారు.

బేగంపేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను పోలీసులు తెలిపారు. ధనియాలుగుట్ట శ్మశానవాటికలోని ఓ గదిలో గత కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసననీయ సమచారం మేరకు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్న మారి మాధవి(39)ని అరెస్టు చేశారు. అదే సమయంలో గదిలో ఉన్న ఓ మహిళతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని నోటీసులు జారీ చేశారు. నిందితురాలు మాధవిపై గతంలో బోయినపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘోరం చూసి ప్రజలు నిశ్చేష్టులైపోయారు.

శ్మశానంలో ఇదేం పనులు? - Tholi Paluku