
కేటీఆర్కి రాహుల్పై మాట్లాడే అర్హత ఉందా?
కేటీఆర్ స్థాయిని మించి మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. రాహుల్పై మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ విషయంలో కవిత మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కాళేశ్వరం అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ స్పందించాలి అని కేటీఆర్ మాట్లాడుతున్నారని, రాహుల్పై మాట్లాడే అర్హత కేటీఆర్కు ఉందా? అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేల గురించి రాహుల్ ఎందుకు మాట్లాడాలి? ఓటు చోరీ గురించి రాహుల్ ఆధారాలతో నిరూపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను తప్పించుకోవడానికి మోడీ అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉప రాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉన్నారని మండిపడ్డారు.రాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయలేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదని లోపాయికారీ ఒప్పందంలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఇప్పటికే కవిత స్పష్టంగా చెప్పారని ధ్వజమెత్తారు. ముందు కవిత మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలని, కవిత వ్యాఖ్యలపై కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్కూడా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎందుకంటే రెండు పార్టీలు మానసికంగా ఒక్కటే కానీ, భౌతికంగా ఒక్కటి కావాల్సి ఉందన్నారు. అందుకే రాహుల్పై కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
