
యూరియా రాకతో రైతులకు ఊరట
తెలంగాణ రైతులకు యూరియా కష్టాలు తీరనున్నాయి. రాష్ట్రనికి కేంద్రం నుండి 11930 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు చెప్పారు. రాష్ర్టంలో యూరియా కోసం రైతులు,మహిళ రైతులు ధర్నాలు .క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండేవారు. రైతులకు సరిపడా లేకపోవడంతో రోడ్ల పై ధర్నాలు చేశారు. రెండు రోజుల క్రితం 23000 మెట్రిక్ టన్నులు సరఫరా అయిందని తెలిపారు.
మరో నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 27,650 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. దీనితో రైతులకు కొంత యూరియా కష్టాలు తీరినటే . శుక్రవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో యూరియా సరఫరాలపై వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపితో మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలోని ఆర్ఈసీఎల్ ఎరువుల కర్మాగారాన్ని తిరిగి పునరుద్ధరించేలా మరోసారి కేంద్రాన్ని కోరాలంటూ అధికారులకు సూచించారు. రాష్ట్రం లోని రైతులకు అవసరమైన ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తెలిపారు.
మంత్రి తుమ్మలతో ఆఫ్రికన్ ప్రతినిధుల భేటీ
వ్యవసాయ, విత్తనోత్పత్తి రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిని స్వయంగా తెలుసుకునేందుకు ఆఫ్రికన్ ప్రతినిధి బృందం శుక్రవారం సచివాలయం లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో రైతుల సంక్షేమం, కోసం సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను, విత్తనోత్పత్తి రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు భాగస్వామ్యంతో సాధించిన విజయాలను మంత్రి వారికి వివరిం చారు. విత్తన రంగంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని పెంపొందించుకుంటామని తెలిపారు.
